Truth Behind Thalapathy Vijay and Wife Sangeetha's Divorce Rumours: సౌత్ సూపర్‌స్టార్ తలపతి విజయ్ వారసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సంధర్భంగా జనవరి 11వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో నడుస్తున్న ఈ సమయంలో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. 23 ఏళ్ల క్రితం వివాహాం చేసుకున్న ఈ జంట ప్రస్తుతానికి ఎలాంటి వివాదం లేకుండానే జీవిస్తున్నా ఎందుకు మొదలైందో?ఎలా మొదలయిందో? తెలియదు కానీ వీరిద్దరూ విడిపోతున్నారు అనే ప్రచారం అనూహ్యంగా మొదలయింది. అయితే ఏది ఏమైనప్పటికీ, తమిళంలో భీభత్సమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న ఆయన అభుమానులకు షాక్ ఇచ్చింది.


ఈ జంట విడిపోతున్నారు అనే వార్తలు వెలుగులోకి రావడంతో అభిమానుల గుండె పగిలేలా చేయడంతో వారంతా ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తున్నారు అంటూ మీడియా మీద విరుచుకుపడుతున్నారు. విజయ్ - సంగీత  భార్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నారని అంటున్నారు, విజయ్ వికీపీడియా పేజీలో ఈ మేరకు ఉండడంతో విజయ్ - సంగీత విడాకుల పుకారు మొదలైంది. అయితే ఇప్పుడు ఆ వికీపీడియా పేజీలో దాని తొలగించి విడాకుల ప్రస్తావనే లేకుండా చేయడంతో ఇది కేవలం 'పుకారు'లా కనిపిస్తోందని అంటున్నారు.


ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై కూడా విజయ్ అభిమానులు నిప్పులు చెరిగారు. విజయ్ వారిసు ఆడియో లాంచ్ లో, అలాగే అట్లీ భార్య ప్రియ బేబీ షవర్ ఫంక్షన్ కు సంగీత రాకపోవడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్టు అయింది. అయితే సంగీత తన కుటుంబంతో యుఎస్‌లో వెకేషన్లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. శ్రీలంక తమిళురాలైన సంగీత సోర్నలింగంను విజయ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. విజయ్ ఆమెను యునైటెడ్ కింగ్‌డమ్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు, ఇక వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


Also Read: Ramya Raghupathi Shocking Video: కృష్ణ చనిపోయిన నైట్ నరేష్- పవిత్ర మిస్సింగ్.. అనాధలా కృష్ణ పార్థివదేహం?


Also Read: Varisu Art director: సినిమా విడుదలకు వారం ముందు విషాదం.. 'వారసుడు' ఆర్ట్ డైరెక్టర్ మృతి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook