Upasana Surrogacy : సరోగసి ద్వారా బిడ్డను కంటోన్న ఉపాసన.. అసలు మ్యాటర్ ఇదా?
Upasana Konidela Surrogacy ఉపాసన కొణిదెల తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే పోస్ట్ వేసి తెలిపాడు. అయితే ఇప్పుడు ఇందులోని కొత్త కోణం బయటకు వచ్చింది. ఉపాసన సరోగసి ద్వారా పిల్లల్ని కంటోందట.
Upasana Konidela Surrogacy ఉపాసన కొణిదెల తల్లి కాబోతోన్నట్టు అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడని, ఆ ఆంజనేయుడి ఆశిస్సులతో వారసుడు రాబోతోన్నట్టుగా చిరంజీవి ఓ ప్రకటన చేశాడు. ఇక్కడి వరకు అందరూ బాగానే సంతోషించారు. మెగా వారసుడు రాబోతోన్నాడంటూ అందరూ సంబరపడిపోతోన్నారు.ఈ క్రమంలో కొత్త వాదన తెర మీదకు వచ్చింది. సహజ గర్భం ద్వారా కాకుండా సరోగసి ద్వారా ఉపాసన పిల్లల్ని కంటోందని సోషల్ మీడియాలో అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
ఇక ఈ మధ్యే ఈ సరోగసి వివాదం తెర మీదకు వచ్చింది. నయనతార విఘ్నేశ్ శివన్‌లు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇండియా సరోగసి నిషేదం చట్టం అమల్లోకి రాకముందే నయన్ సరోగసి చేయించుకుంది. అందువల్ల అది చట్ట బద్దమేనని చైన్నై కోర్టు, అక్కడి ప్రభుత్వం చెప్పేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఉపాసన విషయంలోనూ సరోగసి వార్తలు వస్తున్నాయి.
కొంత మంది సెలెబ్రిటీలు సహజ గర్భం ద్వారా పిల్లల్ని కనేందుకు ఇష్టపడుతన్నారు. ఇంకొంత మంది ఇలా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనేందుకు మొగ్గుచూపుతున్నారు. కాజల్, అలియా భట్, ప్రణీత ఇలా అందరూ కూడా సహజగర్భం ద్వారా పిల్లల్ని కన్నారు. కానీ ఇప్పుడు ఉపాసన విషయంలో వస్తోన్న ఈ సరోగసి వార్తల్లో నిజం ఎంత ఉన్నదో వారికే తెలియాలి.
ఈ ప్రెగ్నెన్సీ వార్త బయటకు వచ్చే ముందు.. రామ్ చరణ్, ఉపాసనలు రేసింగ్ కోర్టులో కనిపించారని, సహజ గర్భం ద్వారా అయితే ఇలా నిర్లక్ష్యం చేయరు కదా? అని లాజిక్స్ తీస్తున్నారు కొందరు. మరి ఇది సహజ గర్భమా? అద్దె గర్భమా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే
Also Read : ED Notice to Rakul Preet : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook