Udhayanidhi Stalin Says Good Bye to Movies: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది, సినిమాల్లో రాణించిన వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఎమ్మెల్యే హీరో అయిన ఉదయనిది స్టాలిన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఉదయనిది స్టాలిన్. తమిళనాడు రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ రవి ప్రమాణం చేయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిది స్టాలిన్ బాధ్యతలు చేపట్టి తన తండ్రి క్యాబినెట్లో అడుగు పెట్టారు. హీరో, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ఉదయనిది స్టాలిన్ 2021లో తన తాతకు బాగా కలిసి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిజానికి ఆ పదవిలో స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. తర్వాత మాజీ సీఎం కరుణానిధి మరణానంతరం డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టగా యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిది స్టాలిన్ చేపట్టారు.


ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తాను సినిమాలకి గుడ్ బై చెబుతున్నానని అని పేర్కొన్నారు. రాజకీయాల్లో బిజీ అవ్వడంతో తన సినిమాల నుంచి తప్పుకుంటున్నానని ఇప్పటికే కమలహాసన్ సర్ బ్యానర్లో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ దాని నుంచి కూడా తప్పుకుంటున్నానని అన్నారు. మారీ సెల్వరాజ్ డైరెక్షన్లో చేస్తున్న మామన్నన్ తన చివరి చిత్రం అని పేర్కొన్నారు.


ఉదయనిధి స్టాలిన్ సుమారు 2012 క్రితం ఓకే ఓకే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఆయన వాస్తవానికి ఈ ఒక్క సినిమాతోనే సరిపెట్టాలని అనుకున్నారు. కానీ తన దగ్గరకు వచ్చిన కథలు నచ్చుతూ ఉండడంతో వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. రెడ్ జెయింట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ కూడా స్థాపించి దాని ద్వారా కూడా పోలీసులు నిర్మించారు. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమా నిర్మాణంలో కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉంది. 
Also Read: Pathan New Controversy: మరో వివాదంలో చిక్కుకున్న పఠాన్.. ఆ బట్టలతో సినిమా రిలీజ్ అవ్వనివ్వం!


Also Read: Manchu Lakshmi: మంచో చెడో పవన్ పక్కనుంటే బాగుందన్న మంచు లక్ష్మీ.. దారుణంగా ఆడుకుంటున్న ఫాన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook