Manchu Lakshmi: మంచో చెడో పవన్ పక్కనుంటే బాగుందన్న మంచు లక్ష్మీ.. దారుణంగా ఆడుకుంటున్న ఫాన్స్!

Pawan Kalyan Fans Targets Manchu Lakshmi: మంచు లక్ష్మిని పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు, దానికి పెద్ద కారణమే ఉందండోయ్, అసలు విషయంలోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 14, 2022, 05:47 PM IST
Manchu Lakshmi: మంచో చెడో పవన్ పక్కనుంటే బాగుందన్న మంచు లక్ష్మీ.. దారుణంగా ఆడుకుంటున్న ఫాన్స్!

Pawan Kalyan Fans Targets Manchu Lakshmi: మంచు లక్ష్మి మీద పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దానికి కారణం ఆమె తాజాగా రీట్వీట్ చేసిన ట్వీట్. మంచు మోహన్ బాబు కుమార్తె అయిన మంచు లక్ష్మి సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆమె నటిగా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేస్తూ వస్తోంది.

ఒకరకంగా నటిగా కంటే నిర్మాతగానే ఆమె ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన మాన్స్టర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఇక అసలు విషయం ఏమిటంటే ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్న సమయంలో ఆ వాహనం రంగు సరిగా లేదంటూ ఏపీ ప్రభుత్వానికి చెందిన కొంతమంది కామెంట్లు చేయడంతో ఆయన వరుస ట్వీట్లు చేశారు.

ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన ఒక ఫోటో షేర్ చేస్తూ చాలా కాలం క్రితం వదిలేసిన మార్షల్ ఆర్ట్స్ మళ్లీ మొదలుపెట్టాను అంటూ ఫోటో షేర్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ తెల్లటి బట్టల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తుండగా ఒక నెటిజన్ మంచు లక్ష్మి అలాగే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో షేర్ చేసి పవన్ కళ్యాణ్ దీన్ని కూడా కాపీ కొట్టారని మంచు లక్ష్మిని కాపీ కొట్టి ఇలా చేయడం కరెక్టేనా అంటూ సరదాగా కామెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు దాన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వెళ్లారు.

అయితే అది మంచు లక్ష్మి కంట పడడంతో వెంటనే దాన్ని రీ ట్వీట్ చేసి మంచో చెడో పవన్ కళ్యాణ్ నా పక్కన ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కామెంట్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఇదేం కరెక్ట్ గా లేదంటూ ఆమెను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ అభిమానులు కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఆమె మీద దారుణంగా బూతులు వర్షం కూడా కురిపిస్తున్నారు.

Also Read: SS Rajamouli's Family: తీవ్ర విషాదంలో మునిగిపోయిన రాజమౌళి ఫ్యామిలీ..ఆమె కన్నుమూయడంతో!

Also Read: Pathan New Controversy: మరో వివాదంలో చిక్కుకున్న పఠాన్.. ఆ బట్టలతో సినిమా రిలీజ్ అవ్వనివ్వం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News