Umair Sandhu on Fake Collections : ఉమైర్ సంధు తనని తాను దుబాయ్ సెన్సార్ సభ్యుడంటూ చెప్పుకుంటాడు. సినిమాలు విడుదల కాక ముందే తనకు తోచినట్టుగా రివ్యూలు ఇస్తుంటాడు. అలాంటి ఉమైర్ సంధుకి మొదట్లో మీడియా బాగానే కవరేజ్ ఇచ్చింది. అయితే ఉమైర్ సంధు ఫేక్ అని ఎప్పుడైతే తెలిసిందే.. అతను ఇస్తున్న రివ్యూలు ఎప్పుడైతే బెడిసి కొట్టడం ప్రారంభమైందో.. సోషల్ మీడియాలో అతని ఇమేజ్ మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ సమయంలో ఉమైర్ సంధు కాస్త హడావిడి చేశాడు. రాధే శ్యామ్ అద్భుతమైని ట్వీట్ వేశాడు. కానీ అది డిజాస్టర్ అయింది. అలా ఉమైర్ సంధు దేని మీద ట్వీట్ వేసినా, బాగుందని చెప్పినా కూడా అవి దారుణంగా బోల్తా కొట్టేశాయి. అయితే గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం కాస్త భిన్నంగా ట్వీట్ వేశాడు. సినిమా వేస్ట్ అని చిరంజీవి ఇక రెస్ట్ తీసుకుంటే బెటర్ అని అన్నాడు. దీంతో మెగా అభిమానులు దారుణంగా ట్రోలింగ్ ప్రారంభించారు.


అయితే గాడ్ ఫాదర్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. డీసెంట్ కలెక్షన్లతో గట్టెక్కేట్టే కనిపిస్తోంది. కానీ ఉమైర్ సంధు మాత్రం అలా ట్వీట్ వేశాడు. సినిమా ఫలితం ఇలా మారిపోయింది. ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయంలోనూ ఇలానే అత్యుత్సాహం ప్రదర్శించాడు. సినిమా ఆహో ఓహో అని ట్వీట్ వేశాడు. అసలు నువ్వు ఎవడ్రా.. సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు అంటూ సుహాసిని కౌంటర్ వేసింది.


 



దీంతో ఉమైర్ సంధు డొల్లతనం బయటకు వచ్చేసింది. గాడ్ ఫాదర్ కలెక్షన్నీ కూడా ఫేక్ అంటూ ట్వీట్ వేశాడు. ఇప్పుడు బ్రహ్మస్త్ర, పీఎస్ 1 అనే రెండు చిత్రాలు ఈ ఏడాది ఫేక్ కలెక్షన్లు, ఫేక్ బ్లాక్ బస్టర్లకు కేరాఫ్ అడ్రస్, పర్ఫెక్ట్ ఉదాహరణలు అంటూ ఉమైర్ సంధు ట్వీట్ వేశాడు. దీనిపై జనాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


బ్రహ్మస్త్ర సినిమా కలెక్షన్లు ఫేక్ అవ్వొచ్చు గానీ.. పీఎస్ 1 కలెక్షన్లు మాత్రం నిజమే అంటూ తమిళ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఉమైర్ సంధు ట్వీట్లను నమ్మే కాలం మాత్రం పోయినట్టే. జనాలు ఉమైర్ సంధుని దారుణంగా ట్రోల్స్ చేసి పడేస్తున్నారు.


Also Read : నటి స్నేహా బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్యామిలీ పిక్స్ వైరల్


Also Read : Sai Rajesh Baby Movie : కొత్త కారుతో సాయి రాజేష్ జోరు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook