Anurag Thakur: `బెస్ట్ వెబ్ సిరీస్‌లకు ఇకపై ఏటా అవార్డులు`: అనురాగ్ ఠాకూర్
IFFI 2023: ఉత్తమ వెబ్ సిరీస్‌లకు ఇకపై ప్రతి సంవత్సరం అవార్డులను ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ అవార్డును ఇవ్వనున్నారు.
Anurag Thakur: ఉత్తమ వెబ్‌సిరీస్‌లకు ఇకపై ఏటా అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందించనుందని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘బెస్ట్ వెబ్ సిరీస్’ క్యాటగిరీలో ఈ అవార్డును అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మన దేశంలో చిత్రీకరించి, భారతీయ భాషలో అందుబాటులో ఉన్న వెబ్‌సిరీస్‌ల్లో బెస్ట్ సిరీస్‌కు అవార్డు ఇవ్వనున్నట్లు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) పేర్కొన్నారు.
అవార్డు బరిలో నిలవాలంటే కథన నైపుణ్యం, సాంకేతిక అంశాలు, తదితర విభాగాల్లో ఉత్తమంగా ఉండాలన్నారు. ఓటీటీలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, భారతీయ భాషల్లో కంటెంట్‌ను తీసుకురావడం, భారతీయుల ప్రతిభను గుర్తించడమే ఈ అవార్డు లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సంవత్సరం నుంచి ఈ పురస్కారాన్ని ఏటా ప్రదానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ తెలిపారు. ఓటీటీలో ప్రసారమైన వెబ్ సిరీస్‌లకు అవార్డులను ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఈ పురస్కారానికి ఎంపికైన వెబ్‌సిరీస్‌కు సర్టిఫికేట్‌తో పాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ కూడా అందించనున్నరు.
మంగళవారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో మంత్రి అనురాగ్ సమావేశమయ్యారు. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్ నియంత్రణ, యూజర్ ఎక్స్ పీరియన్స్ తదితర అంశాలపై చర్చించారు. సృజనాత్మకత పేరిట అసభ్యకర సన్నివేశాలు/సంభాషణలను ప్రసారం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటీటీ సంస్థల (OTT Platforms)పై ఉందని మంత్రి అన్నారు. ప్రాంతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఓటీటీకే దక్కుతుందని.. అయితే అన్ని వయసులు వారు వీక్షించే విధంగా ఆరోగ్యకరమైన కంటెంట్ రూపొదించాలని మంత్రి సూచించారు.
Also read: Bigg Boss 7: బిగ్‌బాస్ హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook