Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఎవరో తెలుసా?

Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచే షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ మెగా షో తెలుగులో ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి పూర్తి చేసుకుని.. ఏడో సీజన్ కు రెడీ అయింది. తాజాగా ఈ షోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 04:16 PM IST
Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఎవరో తెలుసా?

Telugu Bigg Boss Season 7:  బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్‌బాస్‌ మళ్లీ వచ్చిస్తోంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ పుల్ గా పూర్తిచేసుకున్న ఈ రియాలిటీ షో.. ఏడో సీజన్ కు రెడీ అయింది. ఈ సారి ఈ మెగా షో మరిన్ని హంగులతో మన ముందుకు రాబోతుంది. దీని కోసం టీవీ ప్రేక్షకులు ఎంతోగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల  స్టార్‌ మా బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేసింది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహారించనున్నారు. 

అయితే బిగ్‌బాస్‌ 7 ఎప్పుడు మెదలుకానుంది? ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? అనే అంశాలపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ కు సంబంధించి ఓ వార్త ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆంధ్రా ప్లేయర్‌ వై. వేణుగోపాల రావు ఈ మెగా షోలోకి అడుగుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇతడిని హౌస్ లోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. 

Also Read: Saindhav Update: వెంకటేష్ 'సైంధవ్' హార్ట్ ఎవరో తెలుసా?

ఇదే నిజమైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తొలి క్రికెటర్‌గా వేణుగోపాలరావు నిలుస్తాడు. టీమిండియా తరఫున ఆడిన అతి తక్కువ మంది తెలుగు క్రికెటర్లలో వేణు కూడా ఒకరు. ఇతడు ఐపీఎల్ లో దక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కామెంటర్ గా కూడా అలరించాడు.  టీమిండియా తరఫున 16 వన్డేలు, ఐపీఎల్‌లో 65 మ్యాచ్‌లు ఆడాడు. ఇతడు 2019లో ఆటకు గుడ్ బై చెప్పాడు. అయితే వేణుగోపాల రావు బిగ్ బాస్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. 

Also Read: Indian 2 Update: వామ్మో శంకర్ మామూలోడు కాదు.. ఏకంగా ఆ పాత్రల కోసం సూపర్ టెక్నాలజీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News