Ibomma Telugu 2024: ఐబొమ్మలో కొత్త సినిమాలు ఎవరు పెడతారో తెలుసా?
Ibomma Movies Telugu: ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారని అనుమానం మీకు వచ్చిందా?. ఈ సైట్‌ని కొంతమంది విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో సినిమాలు చూడడం వల్ల చాలా ఇష్యూలు రావచ్చు.
Ibomma Movies Telugu: ప్రస్తుతం చాలా మంది కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు నయాపై అక్కర్లేకుండా ఐబొమ్మలో చూస్తున్నారు. అందుకే ఈ సైట్ గురించి పెద్దగా పరిచయం చేయడం అక్కర్లేదు..ఇందలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్‌లు థియేటర్స్‌లో విడుదలైన గంటల వ్యవధిలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో చాలా మంది థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడడం వల్ల టైమ్, డబ్బులు దండగని ఇంట్లోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌లోనే కానిస్తున్నారు. అందుకే ఈ వెబ్‌సైట్ జనాల్లో అంతగా నాటుకుపోయింది. చాలా మంది ఈ ఐబొమ్మలో సినిమాలు చూసేవారి మనుసులో కొన్ని ప్రశ్నాలు ఉంటాయి. కానీ వాటికి సమాధాలు దొరక సతమతమవుతున్నారు..
చాలా మందికి వచ్చిన ప్రశ్నాల్లో మొదటి ఐబొమ్మ వెబ్ సైట్ ఎవరిదని..ఇది చాలా రోజుల నుంచి అందర మదిలో మెదులుతున్న ప్రశ్న, అంతేకాకుండా ఇందులో సినిమాలు ఎవరు పెడుతారు.?, ఈ పెట్టిన సిమాలు స్ట్రీమింగ్ కావడం వల్ల ఎన్ని డబ్బులు వస్తాయి?, ఈ వెబ్‌సైట్ ద్వారా చూడడం వల్ల మొబైల్ ఏమైన వైరస్ వచ్చే వీలుంటుందా? అనే ప్రశ్నాలకు మేము ఈ రోజు సమాధానం మనం తెలుసుకుందాం..
ఐబొమ్మ సైట్‌లో కొత్త కొత్త సినిమాలు ఎవరు పెడతారని మీ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కానీ దీనిని కొంతమంది విదేశాల నుంచి ఆపరేట్ చేస్తారని మాత్రం సమాచారం. అయితే ఇప్పటికీ ఈ వెబ్‌సైట్‌ను చాలా సార్లు సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. అయిప్పటికీ వారు మరో డొమేన్ అడ్రస్‌ను బుక్ చేసి మరీ సినిమాలు స్ట్రీమింగ్ చేశారట. అంతేకాకుండా వీరు అదునాత టెక్నాలజీ వాడడం వల్ల దీనిని నడిపేవారు ఎవరో అని గుర్తుపట్టలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
ఐబొమ్మల్లో కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవ్వడం వల్ల ఇప్పటికీ చాలా మంది సినీ నిర్మాతలు కోట్లలో నష్టపోయారు. దీనిని బ్లాక్ చేయాలని ఎన్ని సార్లు చూసిన వారి మళ్లీ మళ్లీ డొమాన్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తుండడంతో, ఈ సినిమాలు ఏ లోకేషన్ పోస్ట్ అవుతున్నాయో కరెక్ట్‌గా కనిపెట్టలేకపోతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఎక్కువగా ఐబొమ్మలో సినిమాలు చూస్తే సులభంగా మీ స్మార్ట్ ఫోన్‌కి వైరస్ పట్టుకుట్టుంది. దీంతో పాటు అనే రకాల ఇష్యూలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ఐబొమ్మలో వల్ల నడిపించేవారికి ఏం లాభం అనుకుంటున్నారా? వారికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కొత్త కొత్త సినిమాలు ఐబొమ్మాలో వీక్షీస్తున్నారు. ఇలా ప్రతి రోజు లక్షలాది మంది చూస్తున్నారు. దీని కారణంగా ఈ సైట్‌ను నడిపించేవారికి అడ్వటైజర్లు లక్షల ఆదాయం వస్తుందట. దీంతో పాటు వీక్షించిన వ్యూస్ ద్వారా కూడా లక్షల వారకు ఆదయం రావచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందికి తెలియనిది ఏమిటంటే ఐబొమ్మలో సినిమాలు చూడడం చట్టరీత్యా నేరమని..కాబట్టి ఇందులో సినిమాలు చూడడం మానుకుంటే మీకే మంచిది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి