Ram Charan mother in law Shobana Kamineni Naatu Naatu steps దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు రావడం, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడంతో ఆర్ఆర్ఆర్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ఆ ఐకానిక్ స్టెప్పులను జనాలు మళ్లీ ఫాలో అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ క్రమంలోనే ఉపాసన తల్లి, రామ్ చరణ్‌ అత్తగారైన శోభన కామినేని రోడ్డు మీద నాటు నాటు అంటూ స్టెప్పులు వేశారు. తన అల్లుడి పాటకు ఇలా కాలు కదిపేసిందంటూ శోభన వీడియోను జనాలు షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో మీద ఉపాసన స్పందించింది. తన తల్లి ఆనందాన్ని చూసి ఉపాసన మురిసిపోయింది.


 



ఉపాసన చేసిన కామెంట్లు, షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దావోస్‌లో ఇలా తన అల్లుడి గొప్పదనాన్ని చూసి అత్తగా ఎంతో గర్విస్తున్నట్టుగా ఉంది. లవ్యూ మామ్ అంటూ ఉపాసన ట్వీట్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది.


ఆస్కార్ అవార్డుల రేసులోనూ ఆర్ఆర్ఆర్ సినిమా గట్టి పోటీనే ఇస్తోంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉత్తమ చిత్రంగా అయితే వచ్చే అవకాశం కనిపించడం లేదు గానీ.. రాజమౌళికి మాత్రం సర్ ప్రైజ్ వచ్చేలానే ఉంది. ఇక ఎన్టీఆర్‌కు సైతం అవార్డు వస్తుందని అంతా అనుకుంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook