Upcoming Re Releases from Tollywood: ప్రస్తుతం ఎప్పుడో విడుదలై సూపర్ హిట్ లుగా నిలుస్తున్న సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా, ఖుషి సినిమాలను అలానే రీ రిలీజ్ చేశారు. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాతో సహా పోకిరి సినిమాలను కూడా రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ఏడాది మరిన్ని సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు మేకర్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే కొన్ని సినిమాలను డేట్లతో సహా అనౌన్స్ చేయగా మరికొన్ని సినిమాలు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కానీ డేట్లను ప్రకటించలేదు. ఇక తాజాగా డేట్లు ప్రకటించిన సినిమాల విషయానికి వస్తే వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాని జనవరి 19వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అనుపమ కేర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కాశ్మీరీ పండితుల మీద అప్పట్లో జరిగిన ఊసకోత సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.


జనవరి 19వ తేదీన కాశ్మీరీ పండితుల ఊచకోతకు బీజం పడిందని భావిస్తూ వస్తున్న నేపథ్యంలో అప్పుడే ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోపక్క రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ గా నిలిచిన మిరపకాయ సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మిరపకాయ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు మరోసారి రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.


ఇక ఫిబ్రవరి 10వ తేదీన టైటానిక్ సినిమాని విడుదల చేస్తూ ఉండగా వాలెంటైన్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేస్తున్నారు. అలాగే ఇవి కాకుండా ఈ నగరానికి ఏమైంది, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, సెవెన్ బై జి బృందావన్ కాలనీ వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ వాటి డేట్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి 4k వర్షన్ రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రీ రిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొట్టి ముందు ఉండగా త్వరలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమైనా వాటిని క్రాస్ చేస్తాయేమో చూడాలి మరి. 
Also Read: Waltair Veerayya 2M: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్...మెగా హీరోలందరినీ దాటేసిన చిరు!


Also Read: Veera Simha Reddy Story: రియల్ స్టోరీ చేద్దామంటే వద్దన్న బాలయ్య.. అందుకే 'వీరసింహా రెడ్డి'గా మార్పు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook