Veera Simha Reddy Story: రియల్ స్టోరీ చేద్దామంటే వద్దన్న బాలయ్య.. అందుకే 'వీరసింహా రెడ్డి'గా మార్పు!

Veera Simha Reddy Story Change: బాలకృష్ణ హీరోగా జనవరి 12వ తేదీన వీర సింహారెడ్డి అనే సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలుసు కానీ ఆ సినిమాకు డైరెక్టర్ ముందు అనుకున్న కధ వేరట. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 19, 2023, 09:55 AM IST
Veera Simha Reddy Story: రియల్ స్టోరీ చేద్దామంటే వద్దన్న బాలయ్య.. అందుకే 'వీరసింహా రెడ్డి'గా మార్పు!

Veera Simha Reddy Story Change: సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా జనవరి 12వ తేదీన వీర సింహారెడ్డి అనే సినిమా విడుదలైంది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం, అఖండ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేయడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు.

అయితే వాల్తేరు వీరయ్య సినిమాతో పోలిస్తే కలెక్షన్స్ విషయంలో కొంత వెనుకబడినా సరే ఈ సినిమాకు వచ్చే ఆడియన్స్ ఈ సినిమాకి వస్తూనే ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే నిజానికి ముందుగా ఈ సినిమా కధ నందమూరి బాలకృష్ణకు చెప్పలేదని, నందమూరి బాలకృష్ణకు వేరే కథ చెప్పానని చెప్పుకొచ్చారు. నిజానికి నేను నందమూరి బాలకృష్ణ గారికి వేరే కథ చెప్పాను అది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకున్న కథ అయితే అప్పుడు బాలకృష్ణ గారు అఖండ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నా నుంచి ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు.

ఈ కథ చాలాదేమో అని ఆయన చెప్పడంతో నేను నా పాత కథల్లో ఒకదాన్ని డెవలప్ చేసి ఈ వీరసింహారెడ్డి సినిమాని తీసుకొచ్చాను అంటూ డైరెక్టర్ గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ సరసన హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటించారు.

ఆయన భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వాల్తేరు వేరయ్య సినిమా ఈ సినిమాని ప్యూర్ గా డామినేట్ చేసింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి విడుదలైనా సరే వీర సింహారెడ్డి సినిమా కంటే వాల్తేరు వీరయ్య సినిమాకి ఎక్కువ రెస్పాన్స్ అయితే దక్కుతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా వాల్తేరు వీరయ్య సినిమా కాస్త ముందుగానే ఉంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించడం ఆ సినిమాకి మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు.
Also Read: Waltair Veerayya 2M: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్...మెగా హీరోలందరినీ దాటేసిన చిరు!

Also Read: Aishwarya Rai notice: ఐశ్వర్యా రాయ్ కి షాకిచ్చిన అధికారులు.. కోట్లున్నా 20 వేలు కట్టలేరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News