Waltair Veerayya 2M: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్...మెగా హీరోలందరినీ దాటేసిన చిరు!

Waltair Veerayya has reached 2 Million Dollar Mark: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్ సాధించింది. ఆ సినిమా ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు సాధించగా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు రెండో మిలియన్ డాలర్ మార్క్ ను కూడా దాటేసింది. ఆ వివరాలు

Last Updated : Jan 19, 2023, 09:40 AM IST
Waltair Veerayya 2M: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్...మెగా హీరోలందరినీ దాటేసిన చిరు!

Waltair Veerayya has reached 2 Million Dollar Mark in USA: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటున్న ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ప్రేక్షకుల పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ముందుకు దూసుకు వెళ్లిపోతుందని చెప్పచ్చు. ఇక తాజాగా బుధవారం నాడు 20వేల డాలర్లు సంపాదించిన ఈ సినిమా రెండు బిలియన్ డాలర్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చేసింది.

ఈ సినిమా కంటే ముందు గతంలో మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో రెండు టూ మిలియన్ డాలర్ సినిమాలు ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150, సైరా వంటి సినిమాలతో ఆయన టూ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయన మరోసారి టూ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవితేజ సరసన కేథరిన్ తెరెసా హీరోయిన్ గా నటించింది.

బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, బాబీ  సింహా, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక అమెరికాలో టూ మిలియన్ డాలర్ క్లబ్ లో టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ సినిమాలు ఉన్న హీరోగా ప్రభాస్ ఉన్నారు. ఆయన ఖాతాలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు ఉన్నాయి. తర్వాత మహేష్ బాబుకు కూడా నాలుగు సినిమాలు ఉన్నాయి. వారి తర్వాత ఎన్టీఆర్ కి మూడు సినిమాలు ఉండగా ఇప్పుడు చిరంజీవి కూడా మూడు సినిమాలకు చేరుకున్నారు.

రాంచరణ్ రెండు, అల్లు అర్జున్ రెండు, పవన్ కళ్యాణ్ రెండు, వరుణ్ తేజ్ కి రెండు సినిమాలు ఉండగా విజయ్ దేవరకొండ, నితిన్, వెంకటేష్ వీరందరికీ ఒక్కొక్క సినిమా ఈ క్లబ్ లో ఉంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తన ఫ్యామిలీ హీరోలు అందరినీ దాటేసి మరీ ముందుకు వెళ్లిపోయారు. బుధవారం నాడు 20,900 డాలర్లు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య సినిమా కలెక్ట్ చేయగా ఇప్పుడు ప్రస్తుతం టోటల్ కలెక్షన్స్ రెండు మిలియన్ల 4 వేల 30 డాలర్లకు చేరింది.

సినిమాకి రివ్యూస్ నెగిటివ్గా వచ్చినా సరే సంక్రాంతి సీజన్ లో అలాగే సంక్రాంతి తరువాత కూడా ఈ సినిమా మంచి పర్ఫామెన్స్ చూపించిందని అమెరికా ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ దెబ్బతో వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ మరింత పెరిగినట్లు అయింది. సంక్రాంతి సీజన్ కి విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా దాదాపు అనౌన్స్ చేసినట్టే చెబుతున్నారు. మరోపక్క వీర సింహారెడ్డి సినిమాకి కూడా ఓ మాదిరి కలెక్షన్స్ వస్తున్నా ఆ సినిమా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా వన్ మిలియన్ గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. 

Also Read: TFPC Elections: ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్..వారి బహిష్కరణ!

Also Read: Aishwarya Rai notice: ఐశ్వర్యా రాయ్ కి షాకిచ్చిన అధికారులు.. కోట్లున్నా 20 వేలు కట్టలేరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News