Uppena Movie Leaked: ఉప్పెన నిర్మాతలకు తొలిరోజే షాక్, ఆన్‌లైన్‌లో ఉప్పెన మూవీ లీక్!
Uppena Climax Scene Went Viral: టాలీవుడ్‌లో అడుగులు వేస్తూ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు వైష్ణవ్ తేజ్, నటి కృతిశెట్టి. అయితే విడుదలైన తొలిరోజే ఈ సినిమా పైరసీ బారిన పడిందని తెలుస్తోంది. అయితే హిట్ టాక్ అందుకున్న ఉప్పెన బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
Uppena Movie Copy Leaked On Social Medial: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, నటి కృతిశెట్టి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయ తొలి పరిచయం అయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఈ జోడీ సక్సెస్ అందుకుంది. అయితే సినిమా విడుదలకు ముందే గతేడాది ఆడియో పరంగా సక్సెస్ సాధించిన ‘ఉప్పెన’ను డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు తెరకెక్కించాడు.
నేడు (ఫిబ్రవరి 12న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉప్పెన సినిమా(Uppena Movie) అంచనాలు అంచుకుంది. కానీ ఉప్పెన మూవీ యూనిట్‌కు, నిర్మాతలకు అంతలోనే పిడుగులాంటి వార్త. పైరసీ మూవీల జాబితాలో ఉప్పెన్ సైతం చేరిపోయింది. ఎంతో శ్రమించి తీసిన ఉప్పెన సినిమా విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. టెలిగ్రామ్, మూవీరూల్జ్ సహా కొన్ని పైరసీ మూవీలు అప్‌లోడ్ చేసే వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చినట్లు కథనాలు వస్తున్నాయి.
Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్
మరోవైపు ఉప్పెన సినిమా హిట్ టాక్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఉప్పెన సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఉప్పెన. కానీ పైరసీని ప్రోత్సహించవద్దని, ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోకూడదని మూవీ యూనిట్ టాలీవుడ్ ప్రేక్షకులను కోరినట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లలో చూస్తేనే ఫీల్ ఉంటుందని ఓటీటీలో ఈ టాలీవుడ్(Tollywood) సినిమా విడుదల చేయలేదని తెలిసిందే.
Also Read: Uppena movie expectations: టాలీవుడ్‌లో ఉప్పెన ఎందుకు చర్చనీయాంశంగా మారిందో తెలుసా
దర్శకుడు బుచ్చిబాబు ప్రేమకథను నమ్ముకుని సహజంగా చిత్రీకరించాడని ప్రశంసిస్తున్నారు. తొలి సినిమా అయినప్పటికీ వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి బాగా నటించి మెప్పించారు. ఇటీవల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్‌తో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
Also Read: Propose Day 2021: చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, మదిలో మాటల్ని ప్రపోజ్ చేసే తరుణమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook