Uppena Team Success Celebration: గతంలో సినిమా విడుదలయ్యాక 50 రోజులకో, లేదా 100 రోజులు విజయవంతంగా నడిస్తేనో హిట్, సూపర్ హిట్ అని ప్రకటించుకునేవారు. అందుకు తగ్గట్లుగా మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేవి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులలోనే సినిమా హిట్టా, ఫట్టా తేల్చేసి సక్సె్స్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన లేటెస్ట్ హీరో, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు. వైష్ణవ్ తేజ్, నటి కృతిశెట్టి ఇద్దరూ ఉప్పెన సినిమా(Uppena Movie)తో చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సైతం తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడు. ఎటుచూసిన ఉప్పెన హిట్ టాక్, స్టోరీ ఎలివేషన్, రికార్డు కలెక్షన్ల గురించి టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.


Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్


ఈ క్రమంలో మెగా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్(Vaisshnav Tej), డైరెక్టర్లు సుకుమార్, బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి ఉప్పెన మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. మూవీ చాలా బాగా తీశారని దర్శకుడు బుచ్చిబాబును, నిర్మాతలను చిరంజీవి, రామ్ చరణ్ అభినందించారు. ఈ మేరకు ఉప్పెన టీమ్ మెగా సక్సెస్ సెలబ్రేషన్ ఫొటోను ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు.


Also Read: Sumanth Ashwin Wedding Photos: ఘనంగా టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ వివాహం


కాగా, ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉప్పెన సినిమా అంచనాలు అంచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోయగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలనిజం, కొత్తవాళ్లయినప్పటికీ వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి(Kriti Shetty) తమను నిరూపించుకునేలా నటించారని ప్రశంసలు అందుకుంటున్నారు.


Also Read: Uppena movie review: ఉప్పెన మూవీ రివ్యూ, రేటింగ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook