Hebah Patel-Vijayendra prasad : హెబ్బా పటేల్ అందాలకు నెట్టింట్లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు నటిగానూ మంచి ఫాలోయింగ్ ఉంది. కుమారి 21f సినిమాతో తెలుగు వారికి దగ్గరైన హెబ్బా పటేల్.. బోల్డ్ బ్యూటీగా వరుసగా అవకాశాలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత ఆహాలో ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో అందరినీ మెప్పించింది. అయితే ఇప్పుడు వరుసగా హెబ్బా పటేల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెబ్బా పటేల్ కొత్త చిత్రం బ్లాక్ అండ్ వైట్ టీజర్‌ను స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు. ఎస్‌ఆర్ ఆర్ట్స్/ ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ల మీద పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ మేఘనా రెడ్డి సమర్పణలో రాబోతోన్న ఈ  చిత్రానికి ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.


 



నో కమిట్మెంట్స్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలెబ్రేట్ యువర్ ఫ్రీడం..  నా డ్రీమ్, నా ఫ్యూచర్, పెయింటింగ్ యాంబిషన్.. అన్నీ నా చావుతో ఎండ్ కాకూడదు.. అంటూ సాగిన ఈ టీజర్‌లో హెబ్బా పటేల్ రెండు యాంగిల్స్‌లో కనిపించింది. అయితే ఈ మూవీ టీజర్‌ను చూస్తుంటే.. థ్రిల్లర్ జానర్ అనిపిస్తోంది. హెబ్బా పటేల్ సమస్యల్లో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. అయితే డ్యూయల్ రోల్ చేస్తోందా? లేదంటే ఏదైనా కొత్తగా ట్రైచేస్తున్నారా? అన్నది అర్థం కానట్టుగా, ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా కనిపిస్తోంది.


ఈ మూవీ టీజర్‌లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. హెబ్బా అందాలతో పాటుగా నటన కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్లు ప్రకటించారు.


Also Read : Vishnu Manchu Wife : ఆపనికి ఇంట్లో ఒప్పుకోవడం లేదట!.. మంచు విష్ణు ట్వీట్.. నెటిజన్ల కౌంటర్లు


Also Read : Nithya Menen Pregnancy : ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించిన నిత్యా మీనన్.. ఏంటి? పెళ్లయిందా? అంటూ నెటిజన్లు షాక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook