కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి మరో సినీ ప్రముఖు వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. ఇటీవల లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహణ్యం కరోనా బారిన పడి కోలుకున్నా పూర్తిస్థాయిలో ఆరోగ్యం మెరుగవకపోవడంతో కన్నుమూశారు. నిన్న నటుడు రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. కానీ తాజాగా ప్రముఖ సినీ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా బారిన పడి కన్నుమూశారు. సినీ నటుడు వరుణ్ సందేశ్‌ తాత రామచంద్రమూర్తి మృతి (Jeedigunta Ramachandra Murthy Passes Away) పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.




జీడిగుంట రామచంద్రమూర్తి ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించారు. అయితే సినిమాలపై ఆసక్తితో రచయితగా మారారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అనంతరం ఆలిండియా రేడియో ఆకాశవాణిలో చేరారు. అందులోనే దశాబ్దాలపాటు సేవలు అందించి అక్కడే పదవి విరమణ పొందారు. రేడియోకు నాటకాలు రాసేవారు. వాటితో పాటు కథలు, నవలలు, అనువాద రచనలు, సినిమాలకు మాటలు రాస్తూ తన నైపుణ్యాన్ని చాటుకున్నారు రామచంద్రమూర్తి.


Also Read : చిరంజీవికి కరోనా.. టెన్షన్‌లో సీఎం కేసీఆర్, నాగార్జున, తదితరులు!



బుల్లితెరపై దాదాపు 40 వరకు సీరియల్స్‌కు స్క్రిప్ట్ అందించారు. సినిమాలకు రచయితగా పనిచేశారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా తీసిన అమెరికా అబ్బాయి కథ అందించారు. ఈ ప్రశ్నకు బదులేది, పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు సినిమాలకు మాటలు, సంభాషణలు రాశారు. మరికొన్ని సినిమాలకు సహ రచయితగా వ్యవహరించిన జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా సోకడంతో కన్నుమూశారు. వరుణ్ సందేశ్ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe