ఇతర రంగాల ప్రముఖులతో పాటు ఇప్పటికే పలువురు టాలీవుడ్ (Tollywood) సెలబ్రటీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కొక్కరుగా కోలుకుని ప్లాస్మా సైతం దానం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల మెగా బ్రదర్, నటుడు నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా జరిపిన కోవిడ్19 టెస్టులలో చిరంజీవి కరోనా పాజిటివ్ (Chiranjeevi Tested Positive For CoronaVirus) అని తేలింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
- Also Read : Chiranjeevi: మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్
‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. అయితే గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తానని’ చిరంజీవి ట్వీట్ ద్వారా తనకు కరోనా సోకిన విషయాన్ని స్పష్టం చేశారు.
- Also Read : Amma Rajasekhar Elimination: బిగ్ బాస్ 4 నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్.. ఈ సారి కాస్త మర్యాదగా!
చిరంజీవికి కరోనా సోకడంతో తెలంగాణ సీఎం కేసీఆర్, టాలీవుడ్ నటుడు నాగార్జున సహా పలువురు ప్రముఖులలో టెన్షన్ మొదలైంది. ఇందుకు కారణంగా గత శనివారం నాడు మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఆ సందర్భంగా మాస్క్ లేకుండానే ఈ ముగ్గురు ప్రముఖులు కనిపించారు. చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో సీఎం కేసీఆర్, నాగార్జున సైతం తప్పనిసరి కోవిడ్19 టెస్టులకు వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు నాగార్జునకు నెగటివ్ వస్తే ఒకే కానీ, పాజిటివ్ వస్తే ఏంటి సంగతి అని బిగ్ బాస్ తెలుగు 4 నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసి చెక్కులు అందజేశారు. pic.twitter.com/pzurYrbqyO
— Telangana CMO (@TelanganaCMO) November 7, 2020
చిరంజీవి సైతం గత నాలుగైదు రోజులుగా తనను నేరుగా కలిసిన వారు కోవిడ్ టెస్టులకు వెళ్లాలని సూచించారు. ఆయనను కలిసిన వ్యక్తులు కరోనా నిర్ధారణ టెస్టులకు వెళితే ముందుగానే ప్రమాదం రాకుండా కరోనా బారి నుంచి బయటపడవచ్చు. హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన నగదు చెక్ అందజేసేందుకు చిరంజీవి, నాగార్జున, మరికొందరు ప్రముఖులు శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు.
- Photo Gallery: Bigg Boss Telugu 4: బ్యూటిఫుల్ దివి ఫొటోస్ ట్రెండింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe