Nindha Movie OTT: ఓటీటీలో వరుణ్ సందేశ్ నింద మూవీ రచ్చ.. ఒక్క రోజులోనే రికార్డు వ్యూస్
Varun Sandesh Nindha Movie: వరుణ్ సందేశ్ నింద మూవీ ఓటీటీ సందడి మొదలు పెట్టింది. ఈటీవీ విన్ యాప్‌లో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. ఒక్క రోజులోనే భారీగా వ్యూస్ సంపాదించుకుంది. 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడంపై మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Varun Sandesh Nindha Movie: వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మూవీ నింద. జూన్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్స్‌గా నటించగా.. తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ మూవీకి బాక్సాఫీసు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్..
ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి అనూహ్య రెస్పాన్స్ వస్తోంది. ఒక్క రోజులోనే రికార్డు వ్యూస్ తెచ్చుకుంది. 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. నింద మూవీ ఓటీటీలో మరింత వేగంగా దూసుకుపోయే అవకాశం ఉంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అత్యధిక వ్యూస్ రావడంపై నిర్మాత హర్షం వ్యక్తం చేశారు. మరింత మంది ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం ఉందన్నారు.
కథ ఏంటి..?
వివేక్ (వరుణ్ సందేశ్) జాతీయ మానవ హక్కుల సంస్థలో ఉద్యోగి. తమకు సంబంధం లేకుండా అనసరంగా కేసుల్లో ఇరుక్కున్న అమయాకులను శిక్షల నుంచి కాపాడేందుకు పనిచేస్తుంటాడు. వివేక్ తండ్రి జడ్జ్ (తనికెళ్ల భరణి) ఓ కేసులో తన ముందు ఉన్న సాక్ష్యాల ఆధారంగా తీర్పు ఇస్తాడు. అయితే ఆ కేసులో శిక్ష పడిన వ్యక్తి నిర్ధోషి అంటూ ఆయన మరణిస్తాడు. అతన్ని రక్షించేందుకు ఆ కేసును వివేక టేకప్ చేస్తాడు. అతడిని కాపాడేక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్దలను ఎదురించి అతడిని ఎలా రక్షించాడనేది నింద మూవీ కథ.
Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.