Viraaji Trailer Talk: మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాజి’.   ఆద్యంత్ హర్ష డైరెక్షన్ లో  మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వరుణ్ సందేశ్ బర్త్ డే  సందర్భంగా 'కొత్త బంగారు లోకం' చిత్ర డైరెక్టర్  శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్రైలర్ సస్పెన్స్, హార్రర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు చేయని కొత్త జానర్ లో ఈ సినిమా చేసాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కూడా ఫ్రెష్ గా ఉంది. 1970లో ఒక ఎత్తైన కొండపై మెంటల్ పేషెంట్స్ కోసం  నిర్మించిన ఓ భవంతి ఎలా దెయ్యాల కొంపగా మారింది. అందులో ఆత్మలు ఎందుకున్నాయనే కాన్సెప్ట్ బాగుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.



ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ...
 వరుణ్ సందేశ్ నా మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ లో హీరో గా నటించాడు. ఇప్పుడే ‘విరాజి’ సినిమా ట్రైలర్ చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. దాంతో పాటు థ్రిల్లింగ్ గా అనిపించింది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి, రిచ్ గా ఉంది సినిమా.  సినిమా టైటిల్, వరుణ్ సందేశ్ గెట్ అప్ కూడా మరియు సినిమా కథ కూడా చాలా థ్రిల్లింగ్ కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతందనే నమ్మకం ఉందన్నారు.  ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ తో పాటు.. ఇతర పాత్రల్లో  రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా నటించారు.


సాంకేతిక సిబ్బంది విషయానికొస్తే.. దర్శకుడు: ఆద్యంత్ హర్ష, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. జి.వి. అజయ్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు.  ఎబినేజర్ పాల్ (ఎబ్బి) నేపథ్య సంగీతం బాగుంది. రామ్ తూము ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర. ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook