Murali Mohan: మురళీమోహన్లో అలాంటి వ్యక్తిని చూశా.. చాలా ఆనందంగా ఉంది: మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy Venkat Reddy: వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెండితెర అవార్డ్స్ వేడుకలో మురళీమోహన్‌ను ఘనంగా సన్మానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉందన్నారు.
Minister Komatireddy Venkat Reddy: సినీ పెద్ద మురళీమోహన్ ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని.. ఆయనను సన్మానించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మురళీమోహన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా తనను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బిజీ షెడ్యూల్‌ను కూడా పక్కనపెట్టి మురళీమోహన్ కోసం ఈవెంట్‌కు వచ్చానని చెప్పారు. ఆయనను ఒక సినీ యాక్టర్‌గా.. రాజకీయ నాయకుడిగా చూశానని.. బయట మంచి వ్యక్తిగా కూడా చూశానని అన్నారు. అలాంటి వ్యక్తికి సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. విష్ణు బొప్పన వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఆపకుండా చేయడం పదో వార్షికోత్సవానికి తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మురళీమోహన్ మాట్లాడుతూ.. విష్ణు బొప్పన ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి చేతుల మీదుగా తనకు ఈ సన్మానం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ ఇలా పదో వార్షికోత్సవం విజయవంతంగా జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
తన 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని 'నటసింహ చక్రవర్తి' బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరువాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశాయని.. మళ్లీ అది మొదలు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డిని మురళీమోహన్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి.. గత కొన్నేళ్లుగా ఇవ్వాల్సిన అవార్డులను అన్నిటినీ కచ్చితంగా ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం చూస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి.
వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ.. ఈ అవార్డ్స్ వేడుక ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. ఈసారి వికలాంగులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు మీదుగా చెక్కుల అందజేశామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పదో వార్షికోత్సవ అవార్డ్స్ సందర్భంగా మురళీమోహన్‌ను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డు ఫంక్షన్లు చేస్తామన్నారు.
Also Read: ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ.. ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!
Also Read: Pawan Kalyan: ఏపీలో భారీ అవినీతి.. సీబీఐ విచారించండి.. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter