Veera Simha Reddy and Waltair Veerayya Directors Thanks Notes: సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వీర సింహ రెడ్డి సినిమాలు విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న క్రమంలో ఆ రెండు సినిమాల దర్శకులు ఎమోషనల్ అవుతూ రెండు థాంక్స్ నోట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీర సింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ విడుదల చేసిన నోట్ యధాతధంగా మీ ముందుకు ఆశించాను కానీ ఊహించలేదు, ఒక్క పంచ్ తోనే బాక్సాఫీస్ బద్దలుకొట్టే బాలయ్య బాబుతో కెరీర్ లోనే మా వీరసింహారెడ్డి పెద్ద హిట్ అంటూ ఆయన రాసుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాతోపాటు నా సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ కెరీర్ లో అతిపెద్ద హిట్ వీర సింహారెడ్డి, ఇది వీరసింహవిజయం , అందించిన ప్రేక్షకులందరి జీవితాలూ ప్రతి నిమిషం విజయవంతమై ప్రతిరోజూ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు - మీ గోపీచంద్ మలినేని అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ గోపీచంద్ ఆ నాట్ ముగించారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా దర్శకుడు బాబీ కూడా సినీ ప్రేమికులకు మెగాస్టార్ చిరంజీవి గారి మరియు మాస్ మహారాజ రవితేజ గారి అభిమానులకు ప్రతీ ఒక్కరికీ ముందుగా నా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి నాకు ఆజన్మాంతం గుర్తు ఉండిపోతుందని పేర్కొన్నారు.


మా రెండేళ్ల కష్టానికి ఫలితంగా ఈ రోజు వాల్తేరు వీరయ్య సినిమా పై మీరు అంతా చూపించే ప్రేమ, ఆదరణకి మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మంచి కంటెంట్ తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది మరొక సారి రుజువు చేశారని బాబీ రాసుకొచ్చారు. ఇక  మెసేజ్ ల రూపం లో కాల్స్ లో మీరు చూపించే అభిమానం నేను పడిన కష్టాలు ఒడిదుడుకులు మర్చిపోయే లాగా చేయడమే కాక నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, నేను అమితం గా అభిమానించే నా రెండు కళ్ళు లాంటి హీరో లని పెట్టి ఒక బ్లాక్ బస్టర్ గా మలచగలగడం కేవలం మా తల్లిదండ్రుల కోరిక, ఆ దేవదేవుని అశీసులతో పాటు మీ అందరి ప్రోత్సాహం వలెనే సాధ్యం అయిందని బాబీ పేర్కొన్నారు.


ఈ ఘన విజయం సందర్భంగా మరొక్క సారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న బాబీ ముఖ్యం గా నాతో పాటు కలిసి ఈ ప్రయాణం చేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్ కి, ఆర్టిస్ట్స్ కి, మీడియా మిత్రులకి పేరు పేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, నా ప్రొడ్యూసర్స్,డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ కి సగర్వంగా చెప్తున్నా ఈ విజయం మీది, నాది మన అందరిదీ ఇట్లు మీ బాబీ కొల్లి అని అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. 
Also Read: Waltair Veerayya Day 2: రెండో రోజు సగానికి సగం తగ్గిన కలెక్షన్స్.. అయినా ఎక్కడా తగ్గని వీరయ్య!


Also Read: VSR vs WV Collections: రెండో రోజు 'వీర సింహా రెడ్డి'ని డామినేట్ చేసిన వాల్తేరు వీరయ్య.. ఎన్ని కోట్లు ఎక్కువంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook