Narappa Collections : నారప్ప.. ఏందప్పా ఇది.. వెంకీమామ స్టామినా ఇంతేనా?
Narappa One Day Collection వెంకటేష్ బర్త్ డే సందర్భంగా నారప్ప సినిమాను డిసెంబర్ 13న థియేటర్లో విడుదల చేశారు. ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించిన ఈ సినిమా ఎంత వసూల్ చేసిందో ఓ సారి చూద్దాం.
Narappa One Day Collection తమిళంలో ధనుష్ చేసిన అసురన్ సినిమాను తెలుగులో వెంకటేష్ నారప్పగా రీమేక్ చేశాడు. ఇక్కడ ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం కరోనా సమయంలో తప్పని పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్లంతా కూడా సురేష్ బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీటీలో ఈ చిత్రం బాగానే ఆడింది. థియేటర్లో అంతగా ఆడకపోవచ్చు అన్నట్టుగా సురేష్ బాబు అప్పుడే చెప్పేశాడు. ఇది ఓటీటీ మూవీ, థియేటర్ సినిమా కాదంటూ మాట్లాడినట్టున్నాడు.
అసలే అది రీమేక్ సినిమా.. అప్పటికే తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. మన వాళ్లు కూడా సబ్ టైటిల్స్‌తో సినిమాను చూసేసి ఉన్నారు.. అలాంటిది థియేటర్లో విడుదల చేస్తే రిస్క్ అని సురేష్ బాబు ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అవే నిజమయ్యాయి. వెంకీమామ బర్త్ డే అంటూ డిసెంబర్ 13న నారప్ప సినిమాను ఒక్క రోజు థియేటర్లోకి తీసుకొచ్చారు. అసలే ఇప్పుడు అంతా కూడా రీ రిలీజ్ ట్రెండ్స్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.
ఇలానే మహేష్ బాబు బర్త్ డేకు పోకిరి, పవన్ కళ్యాణ్ బర్త్ డేకు జల్సా సినిమాలను రిలీజ్ చేస్తే కోట్లు కుమ్మరించాయి. కానీ నారప్ప మాత్రం దారుణమైన కలెక్షన్లను రాబట్టింది. ఎక్కడా కూడా హౌస్ ఫుల్ అయినట్టు దాఖలాలు కనిపించడం లేదు. ఈ చిత్రం ఒక్క రోజులో రాబట్టిన మొత్తం ఇంచు మించుగా రూ. 25 లక్షల షేర్ మాత్రమే.
దీంతో వెంకీమామ క్రేజ్, నారప్ప స్టామినా ఇంతేనా? అని అందరూ అనుకుంటున్నారు. అయినా ఇది కూడా చాలా ఎక్కువే అని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి సురేష్ బాబు మాత్రం వచ్చిన ఈ అమౌంట్‌ను చారిటీకే ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకీమామ, రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లోకి రాబోతోంది.
Also Read : Sreemukhi New House : కొత్త ఇంట్లోకి శ్రీముఖి.. ఫ్యామిలీ పిక్స్ వైరల్
Also Read : Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook