Narappa Movie: విక్టరీ వెంకటేష్ అప్‌కమింగ్ మూవీ నారప్పపై ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. తమిళ సూపర్ హిట్ మూవీకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత లేదు. ఓటీటీలో విడుదలవుతుందనే చర్చ నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి ప్రతిష్ఠంభన నెలకొంది. కొన్ని సినిమాల రిలీజ్ వాయిదా పడితే మరికొన్ని సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. ఇంకొన్ని సినిమాల షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నేపధ్యంలో విక్టరీ వెంకటేష్(Venkatesh)నటిస్తున్న సినిమా నారప్పపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేశ్ రెండు విభిన్న పాత్రల్లో కన్పించబోతున్నాడు. ప్రియమణి హీరోయిన్‌గా కన్పించనున్న ఈ సినిమా..భూ వివాదం, కుల వ్యవస్థ వంటి సామాజిక అంశాలతో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్టర్, టీజర్‌లకు మంచి స్పందన లభించింది. మణిశర్న సంగీతం అందించిన నారప్ప సినిమా వాస్తవానికి మే 14న థియేటర్లలో విడుదల కావల్సి ఉండగా..కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది.


థియేటర్లు ఎప్పుడు తెర్చుకుంటాయనే విషయంపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా లేదు. ఫలితంగా ఈ సినిమాను ఓటీటీలో(OTT)విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో(Amazon Prime)చర్చలు నడుస్తున్నాయని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూలై 24వ తేదీన నారప్పను (Narappa movie)ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.


Also read: Oke Oka Jeevitham first look: ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook