విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) ప్రస్తుతం యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమాలో ( Narappa movie ) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అలాగే అక్టోబర్ చివరి నాటికి వెంకీ తన షూటింగ్‌ని ముగించుకొని ఆ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ అయిన 'F3' సినిమా షూటింగ్‌కి ( F3 movie shooting ) హాజరు కానున్నాడు. 'F2' మూవీకి సీక్వెల్‌గా ( F2 movie sequel ) సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను కూడా తొలి భాగాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడినే ( Anil Ravipudi ) డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే వెంకీ, వరుణ్ తేజ్‌లు ఎఫ్3 స్క్రిప్ట్‌కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. Also read : V Movie leaked: పైరసీ బారిన పడిన V ఫుల్ మూవీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

F3 మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మెహ్రీన్ కౌర్ పిర్జాదాతో పాటు మరో కొత్త జంట కనిపించనున్నారు. జూమ్ కాల్‌లో అనిల్ రావిపూడి వారికి కథని వినిపించినట్టు సమాచారం. ఆ మరో జంటలో ఒక కొత్త హీరో ఖరారైనట్టు టాక్. ఇప్పుడు అనిల్ మరొక హీరోయిన్ కోసం చూస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. Also read : Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?


ఈ చిత్ర షూటింగ్ ఏ అవాంతరాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం జరిగితే.. మే 2021లో విడుదల అవనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఎఫ్ 3 మూవీని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. Also read : అన్నీ రుచి చూశా అంటున్న హీరోయిన్