Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మరో మూడు చిత్రాలను ప్రకటించారు. అందులో మొదటిది క్రిష్‌తో ( Director Krish ) కాగా రెండోది హరీష్ శంకర్‌తో ( Director Harish Shankar ), ఇక మూడో చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ( Director Surender Reddy ) దర్శకత్వంలో చేయనున్నారు.

Last Updated : Sep 5, 2020, 02:34 PM IST
 Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మరో మూడు చిత్రాలను ప్రకటించారు. అందులో మొదటిది క్రిష్‌తో ( Director Krish ) కాగా రెండోది గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో ( Director Harish Shankar ) చేయనున్నారు. ఇక మూడో చిత్రం కిక్, రేసుగుర్రం, సైరా నర్సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ( Director Surender Reddy ) దర్శకత్వంలో చేయనున్నారు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా పవన్ ఈ సినిమాలతోనే బాగా బిజీగా ఉండబోతున్నారు. Also read : అన్నీ రుచి చూశా అంటున్న హీరోయిన్

ఐతే తాజాగా పవన్ కళ్యాణ్ వెబ్ సీరీస్ ( Pawan Kalyan web series ) చేయబోతున్నట్లు టాలివుడ్‌లో టాక్ నడుస్తోంది. రాబోయే రోజుల్లో OTT ప్లాట్‌ఫామ్స్ సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు తీసుకురాబోతున్నాయనే నగ్న సత్యాన్ని ఈ లాక్ డౌన్ కాలం నిరూపించింది. అలాగే ఈ లాక్ డౌన్ సమయంలో పవన్ కొన్ని జాతీయ, అంతర్జాతీయ షోలు ఎక్కువగా చూశారని, అవి చూశాకా తాను కూడా రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. Also read : Sarkaru Vaari Paata: మహేష్ బాబు డబుల్ రోల్స్ ఇవేనా ?

వాస్తవానికి ప్రస్తుతానికి పవన్‌కి వెబ్ సీరీస్ చేసే సమయమే లేదు. అలాగే ఇప్పటి వరకు వెబ్ సీరీస్ చేయాలనే ప్లాన్ కూడా లేనప్పటికీ, వెబ్ సిరీస్‌లో చూపిన కథనాలు పవన్ కళ్యాణ్‌కు చాలా ఆసక్తిరేపాయని టాలివుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంతకి పవన్ కళ్యాణ్ వెబ్ సీరీస్ చేస్తాడో లేదో వేచి చూడాలి మరి. Also read : VV Vinayak meets Chiranjeevi చిరంజీవితో వివి వినాయక్‌ సినిమా ?

Trending News