అన్నీ రుచి చూశా అంటున్న హీరోయిన్

అనుపమ పరమేశ్వరన్‌ ( Actress Anupama Parameswaran )... తెలుగు వారి మనసు దోచుకున్న ఈ తరం ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకరు. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా.. అతికొద్ది కాలంలోనే అచ్చం తెలుగింటి ఆడపిల్లలా అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబసభ్యులతో ఎంచక్కా ఎంజాయ్ చేసిందట.

Last Updated : Sep 5, 2020, 02:11 AM IST
అన్నీ రుచి చూశా అంటున్న హీరోయిన్

హైదరాబాద్‌: అనుపమ పరమేశ్వరన్‌ ( Actress Anupama Parameswaran )... తెలుగు వారి మనసు దోచుకున్న ఈ తరం ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకరు. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా.. అతికొద్ది కాలంలోనే అచ్చం తెలుగింటి ఆడపిల్లలా అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబసభ్యులతో ఎంచక్కా ఎంజాయ్ చేసిందట. తిరిగి షూటింగ్స్‌తో బిజీ అయ్యే సమయం రావడంతో లాక్ డౌన్ కాలాన్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఎలాంటి డైట్ తీసుకున్నారని మీడియా అడగ్గా.. అనుపమ నుంచి ఎన్నో ఆసక్తికరమైన జవాబులు వచ్చాయి. Also read : Sarkaru Vaari Paata: మహేష్ బాబు డబుల్ రోల్స్ ఇవేనా ?

డైట్ విషయంలో ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవని చెప్పిన అనుపమ... తాను ముందు నుంచీ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకునేదాన్ని అని వెల్లడించింది. గతంలోనూ తాను జంక్‌ ఫుడ్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్, సాఫ్ట్‌ డ్రింక్స్‌ ( Junk foods, chocolates, Ice creams, Soft drinks ) లాంటి వాటి జోలికి వెళ్లే అలవాటు లేదని.. అవి తప్ప మిగతావన్నీ రుచి చూసేశా అని చెప్పుకొచ్చింది. అన్నం, పప్పు, పెరుగు వంటి మెనూతో మూడు పూటలా భోజనం పెట్టినా ఇష్టంగా తింటానని అనుపమ వ్యాఖ్యానించింది. Also read : VV Vinayak meets Chiranjeevi చిరంజీవితో వివి వినాయక్‌ సినిమా ?

Trending News