Kushi Success Meet: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు 'ఖుషి' సినిమా ద్వారా సక్సెస్ బాట పట్టాడు. ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఖుషి సక్సెస్ మీట్(Kushi Success Meet)ను సోమవారం విశాఖపట్నంలో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో విజయ్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఈ మూవీ ద్వారా తాను సంపాదించిన మెుత్తంలో కోటి రూపాయలను వంద కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపాడు. విజయ్ ఉదారత పట్ల ఆయన ఫ్యాన్స్ తోపాటు నెటిజన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ లో హీరో విజయ్ తోపాటు దర్శకుడు శివనిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సక్సెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ.. ''నా మీద, మా సినిమాపైన సోషల్‌ మీడియాలో డబ్బులిచ్చి మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎన్నో ఫేక్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలనూ దాటుకుని మా సినిమా విజయవంతంగా ప్రదర్శిమవుతుందంటే దాని కారణం మీ ప్రేమే. ఈ మూవీ విషయంలో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక నెరవేరింది. ఇక నుంచి మీ గురించి పనిచేయాలనుకుంటున్నా. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి కోటి రూపాయల మెుత్తాన్ని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) వారికి పది రోజుల్లో అందిస్తా. పూర్తి వివరాల కోసం సంబంధిత  ఫామ్స్‌ని సోషల్‌ మీడియాలో మంగళవారం పోస్ట్‌ చేస్తాం''’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.


సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే రూ.70 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇందులో విజయ్ కు జోడిగా సమంత నటించనుంది. ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ, లక్ష్మి మరియు రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. విజయ్ త్వరలో గౌతమ్ తిన్ననూరి చిత్రంలో నటించనున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. VD 12 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కునుంది. 


Also Read: Shahrukh Khan: తిరుమల శ్రీవారి సన్నిదిలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook