Vijay Deverakonda Movies: ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొన్ని చిన్నాచితకా పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో అందరికీ పరిచయమయ్యారు. హీరోగా ఆ సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తన సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. కానీ ఏమాత్రం భయపడకుండా చాలా స్ట్రాంగ్ గా నిలబడి విజయ్ దేవరకొండ ట్రోల్స్ చేసిన వారి మీద కౌంటర్లు వేశారు. కానీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత రౌడీ బాయ్ ట్యాగ్ కూడా తగిలించేసుకున్న విజయ్ దేవరకొండ మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టలేడేమోనని కొందరు అనుకున్నారు.


కానీ గీతగోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. విడుదల కి ముందే టాక్సీవాలా సినిమా పైరసీ ప్రింట్ బయటకు వచ్చేసినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విజయ్ సత్తా ని ఇండస్ట్రీకి చాటింది. అంతేకాకుండా నిర్మాత గా కూడా మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో హిట్ నమోదు చేసుకున్న విజయ్ ఆ తర్వాత మాత్రం బాగా డల్ అయిపోయారు.


విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా అంతంత మాత్రం గానే ఆడింది. విజయ్ చాలా వరకు తన సినిమాలని భారీ స్థాయిలోనే ప్రమోట్ చేస్తారు. అదే తన విషయంలో నెగిటివ్ గా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో కూడా విజయ్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో చితికిలబడింది. 


ఇక లైగర్ సినిమా విషయంలో కూడా విజయ్ దేవరకొండ బీభత్సం గా ప్రమోట్ చేశారు. అసలు కలెక్షన్ల కౌంటింగ్ 200 కోట్ల నుంచి మొదలు పెట్టాలి అంటూ సినిమా గురించి ఒక రేంజ్ లో హైప్ ఇచ్చారు. అంతకుముందు కూడా భారీగా ప్రమోషన్లు చేసినప్పటికీ సినిమాలు బాగుండడంతో బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి కానీ లైగర్ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ కెరియర్ లోనే పీడకలగా మారిపోయింది. 


ఆ తర్వాత ఖుషి సినిమా విషయంలో ప్రమోషన్లు మామూలుగానే చేశాడు. మంచి హిట్ కూడా అందుకున్నాడు. బ్లాక్ బస్టర్ కాకపోయినాప్పటికీ సినిమా చాలావరకు మంచి రివ్యూస్ అందుకుంది ఈ చిత్రం. కానీ ఫ్యామిలీ స్టార్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ అన్నీ తలకిందులు అయిపోయాయి. 


రౌడీ బాయ్ గా ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ స్టార్ గానే మారిపోతారు అని అందరూ అనుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సగటు మనుషులందరూ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకి కనెక్ట్ అవుతారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ని అంచనాలు తారు మారు అయ్యాయి. 


ఫ్యామిలీ స్టార్ సినిమా తో కూడా విజయ్ దేవరకొండ భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఒకప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వాటి గురించి భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకున్న విజయ్ దేవరకొండ అసలు ఏమైపోయాడు అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 


అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలు చేసినప్పుడు ఆడియన్స్ పల్స్ ని బాగా క్యాచ్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కనీసం యావరేజ్ సినిమాలు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అని ఫాన్స్ వాపోతున్నారు.


ఏదేమైనా ఒక నటుడిగా విజయ్ దేవరకొండ కి మంచి పేరుంది. చేతిలో కూడా రెండు మూడు మంచి సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ తో కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి తన తదుపరి సినిమాలతో అయినా విజయ్ దేవరకొండ మళ్ళీ తన మార్క్ హిట్ అందుకుంటాడు అని అభిమానులు ఆశిస్తున్నారు.


Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?


Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook