Sara Ali Khan and Janhvi Kapoor wants to dating with Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'నువ్విలా‌', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌' సినిమాలలో చిన్న పాత్రలో నటించినా  పెద్దగా గుర్తింపు రాలేదు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ఈ సినిమా విజయ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'పెళ్లి చూపులు' అనే సినితో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు, యాటిట్యూడ్‌కు యువత ఫిదా అయింది. టాలీవుడ్‌లో విజయ్ పేరు మార్మోగిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్‌లోకి రీమేక్ అయింది. స్టార్ హీరో షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్' టైటిల్‌తో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో మనోడి పేరు హిందీ జనాల్లో కూడా పాప్ అయింది. ఆ తర్వాత విజయ్  సినిమాలు యూట్యూబ్‌లో డబ్ అవ్వడంతో.. హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా విజయ్ నటన, బాడీ లాంగ్వేజ్‌కు ఫిదా అయ్యారు. ఇది మరోసారి నిరూపితం అయింది. 


బాలీవుడ్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' ఇటీవలే 7 వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. జూలై 7న మొదలైన ఎపిసోడ్ 1లో స్టార్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ అలియా భట్ పాల్గొని రచ్చ చేశారు. వీరిద్దరితో తాజాగా కరణ్ జోహార్ సందడి మాములుగా లేదు. తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ వదిలారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కుర్ర హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ నానా హంగామా చేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి నుంచి కరణ్ జోహార్ ఎన్నో విషయాలను బయటికి లాగాడు. 


ఎపిసోడ్ 2లో భాగంగా ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అని జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ను కరణ్ జోహార్ అడిగాడు. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని సారా సమాధానం చెప్పగా.. జాన్వీ వైపు కరణ్ చూడగానే ఆమె కూడా విజయ్ దేవరకొండ అని చెప్పింది. దాంతో ఇద్దరు యువ హీరోయిన్స్ నవ్వుకున్నారు. ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయింది. దీనికి కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అట్లుంటది విజయ్ దేవరకొండతో' అని ఒకరు కామెంట్ చేయగా.. 'విజయ్ దేవరకొండ కోసం కొట్టుకుంటున్న బాలీవుడ్ యువ హీరోయిన్స్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 'లైగర్' సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా హిట్ అయితే మనోడి రేంజ్ మరింత పెరగనుంది. 


Also Read: ఇంగ్లండ్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర.. తొలి పేసర్‌గా అరుదైన రికార్డు!


Also Read: Janmashtami 2022: కృష్ణ జన్మాష్టమి రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook