Vijay Devarakonda: ఎన్టీఆర్, రామ్ చరణ్ రూట్లో విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda: అవును విజయ్ దేవరకొండ.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ యేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారి ఎన్టీఆర్, చరణ్ రూట్ ను ఫాలో అవుతున్నారు.
NTR - Ram Charan - Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఇపుడు హిట్ కోసం ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఫాలో అయిన రూట్ నే నమ్ముకున్నాడు. అవును హీరోలు తమ కెరీర్ లో ద్విపాత్రాభినయం చేయడం కామన్. అది కూడా అన్నాదమ్ములుగా .. తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలనే అందుకున్నాయి. కొన్ని చిత్రాలు బొక్క బోర్లా పడ్డ సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. అది కూడా తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడట.
మన యంగ్ హీరోల విషయానికొస్తే.. ప్రభాస్.. బాహుబలి సిరీస్ లో తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే కదా. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా .. కెరీర్ మొదట్లో ‘ఆంధ్రావాలా’ సినిమాతో పాటు ఆ తర్వాత ‘శక్తి’ సినిమాల్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి. అటు రామ్ చరణ్ కూడా ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం రెండు డిఫరెంట్ పాత్రల్లో తండ్రీ కొడుకులుగా తెరపై కనిపించనున్నాడు.
తాజాగా వీళ్ల రూట్లనే విజయ్ దేవరకొండ కూడా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో రెండు డిఫరెంట్ పాత్రల్లో అది కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ సినిమాను 1854 నుంచి 1778 మధ్య జరిగిన యదార్ధ సంఘటనల సమాహారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల సమాహారంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రాబోతుంది. మరి తండ్రీ కొడుకులుగా విజయ్ దేవరకొండ చేయబోతున్న ఈ ప్రయోగం విజయ్ దేవరకొండను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter