Vijay Devarakonda Instagram Followers: కొత కొన్నేళ్లుగా సోషల్ మీడియా అనేది సమాచారాన్ని చేరవేయడానికి అత్యంత కీలకంగా మారింది. కేవలం తమ ఫోన్‌లో ఇంటర్నెట్ వుంటే చాలు.. వరల్డ్‌లో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ సామాజిక మాధ్యమాలను మన హీరో, హీరోయిన్లు బాగానే వాడుకుంటున్నారు. అంతేకాదు తమకు సంబంధించిన విశేషాలను తమ ఫ్యాన్స్‌కు చేరవేస్తున్నారు. అంతేకాదు తమ సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు.ఇక తెలుగు హీరోలు ఎంతో మంది సామాజిక మాధ్యామాలను యూజ్ చేసుకుంటున్నారు. అందులో విజయ్ దేవరకొండ ముందు వరసలో ఉంటారు. తాజాగా ఈయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. తెలుగులో అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండ ఇన్‌స్టాను ఈ రేజం్ ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా ఆయన క్రేజ్ ను ఎలాంటిదో చూపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ తన కెరీర్ గురించి కొత్త సినిమాల అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తెలియజేయడంలో ముందు వుంటారు.


అంతేకాదు తనకు సినిమాలకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వచ్చే రూమర్స్ పై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉంటారు. వాటిని అప్పటికపుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఈయనలోని ఈ నైజమే ఈయన్ని అభిమానులకు దగ్గర చేసింది. గతేడాది 'ఖుషీ' మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ.. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.


Also read: AP Assembly Budget Session 2024: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నిరోజులంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook