Vijay devarakonda as The Family Star Second single Promo: టాలీవుడ్‌ సహా వివిధ సినీ ఇండస్ట్రీస్‌లో హిట్ కాంబినేషన్స్‌లో సినిమాలు వస్తున్నాయంటే ఈ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ మరో లెవల్లో ఉంటుంది.  అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌లో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం కాంబో అని చెప్పాలి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో  వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఇపుడీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ది ఫ్యామిలీ స్టార్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ సహా ఇతర ప్రచారా చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను ప్రోమోను విడుదల చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటి కపుడు ఇస్తూ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే ఆయన్ని అభిమానుకులకు దగ్గరయ్యేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదిన ఈ సినిమా ను తెలుగు, తమిళం, హిందీలో గ్రాండ్‌గా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా' ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ పాటను ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటలో వీళ్లిద్దరు పెళ్లి వేడుకలకు సంబంధించిన వచ్చే  ఈ పాట విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా.. ఏనుగంబారీ సిద్దంగుంచా అంటూ సాగే ఈ పాట పల్లవి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ఈయనకు ప్రముఖ  సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. తెలుగులో అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాను ఈ రేంజ్ ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా ఆయన క్రేజ్ ను ఎలాంటిదో చూపిస్తోంది. అంతేకాదు తనకు సినిమాలకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వచ్చే రూమర్స్ పై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉంటారు. వాటిని అప్పటికపుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. 


విజయ్ దేవరకొండలోని ఈ నైజమే ఈయన్ని అభిమానులకు దగ్గర చేసింది. గతేడాది 'ఖుషీ' మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయినా.. ఈ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపించలేదు. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. 


Also read: Social Media Harassment: సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్, తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook