Vijay devarakonda as The Family Star teaser : టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్స్‌లో సినిమాలు వస్తున్నాయంటే ఈ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌లో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం కాంబో అని చెప్పాలి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఇపుడీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ది ఫ్యామిలీ స్టార్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటి కపుడు ఇస్తూ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే ఆయన్ని అభిమానుకులకు దగ్గరయ్యేలా చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండకు  సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. తెలుగులో అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాను ఈ రేంజ్ ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా ఆయన క్రేజ్ ను ఎలాంటిదో చూపిస్తోంది. అంతేకాదు తనకు సినిమాలకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వచ్చే రూమర్స్ పై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉంటారు. వాటిని అప్పటికపుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు.


విజయ్ దేవరకొండలోని ఈ నైజమే ఈయన్ని అభిమానులకు దగ్గర చేసింది. గతేడాది 'ఖుషీ' మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయినా.. ఈ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపించలేదు. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు.


Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.