Kushi OTT Release date: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. మజిలీ ఫేమ్ శివనిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడం, లాంగ్ గ్యాప్ తర్వాత సామ్ చేసిన మూవీ కావడంతో ఖుషిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆడియెన్స్ ఎక్సపెక్టేషన్ కు తగ్గేట్టే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే రూ. 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.50 కోట్ల మార్కును క్రాష్ చేసింది. అయితే వీకెండ్ కు వచ్చేసరికి ఈ మూవీ కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ఎంతలా అంటే మూడు రోజుల్లో రూ.70 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత పట్టు మని పది కొట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఫైనల్‌ రన్‌లో దాదాపు రూ.12 కోట్లు నష్టాన్ని మిగిల్చినట్లు టాక్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవ్ రొమాంటింక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఖుషి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి (అక్టోబరు 01) నుంచే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. సరిగ్గా నెల రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోఅందుబాటులో ఉండనుంది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌ సంగీతం అందించారు. ఇందులో సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, జయరాం, రోహిణి, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంచెక్కా ఎంజాయ్ చేయండి. 


Also read: Samantha: వరల్డ్‌ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్న సామ్, ఫోటోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి