Family Star Collections:
గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ కి అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ విడుదలైన మొదటి షో నుంచే ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ చిత్రం పైన విపరీతమైన ట్రోల్స్ రావడం మొదలెత్తాయి. ప్రీ బుకింగ్స్ లో సైతం హవా చూపించండి ఈ చిత్రం ఇంత నెగిటివ్ టాక్ రావడం వల్ల బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఢీలా పడింది.


హైదరాబాద్, అమెరికా బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమాని నిర్మాత చాలా రిచ్‌గా తెరకెక్కించారు. అంతేకాదు ఇందువల్ల ఈ సినిమాకి దిల్ రాజు భారీగా ఖర్చు చేశారు. ఈ చిత్రం కోసం సుమారుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 45 కోట్ల వరకు జరిగింది. కానీ సినిమా విడుదల తరువాత సీన్ మొత్తం మారిపోయింది.


ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో విడుదల చేయగా మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మిక్స్ డ్ రివ్యూల కారణంగా, ఐపీఎల్ టోర్నీ కారణంగా మొదటి రోజు కూడా ఈ చిత్రానికి పెద్దగా కలెక్షన్స్ రాలేదు.


మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక మొత్తం పైన ఈ సినిమా మొదటి రోజు సుమారుగా 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ చిత్రం రెండో రోజు మరీ దారుణంగా పడిపోయింది. ఈ సినిమా రెండోవ రోజు ఆంధ్రా, నైజాం, కర్ణాటక, తమిళ రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 3 కోట్ల నికరంగా, 4 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది.


ఈ రకంగా చూస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఈ విజయ్ దేవరకొండ సినిమా పరిస్థితి అయిపోయినట్టే అని ఎంతో మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


Also Read: Tukkuguda Congress Meeting: కేసీఆర్ ను బహిరంగంగా ఉరితీయాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ..


Also Read: CM Revanth Reddy: పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook