Vijay Deverakonda and Ananya Panday resume Puri Jagannadh's Liger shoot in Los Angeles : పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్‌. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. లైగర్ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో సాగుతోంది. ఇటీవలె లాస్‌ వెగాస్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసిన లైగర్ మూవీ యూనిట్.. ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌లో (Los Angeles) షెడ్యూల్‌ని స్టార్ట్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఛార్మీ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. లైగర్‌ టీమ్.. లాస్‌ ఏంజెల్స్‌ నుంచి హాయ్‌ చెబుతోంది అంటూ ఫోటోను షేర్ చేసింది. ఈ పిక్‌లో విజయ్‌ (Vijay), అనన్య, (Ananya), ఛార్మీ, పూరీజగన్నాథ్‌ (Puri Jagannadh) ఉన్నారు. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ మెయిన్‌ లీడ్‌లో నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మైక్ టైసన్ సిల్వర్ స్క్రీన్ పై (Silver screen) తళుక్కుమనడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. 


Also Read : IND vs NZ 1st Test: కాన్పూర్ టెస్టు నాలుగో రోజు టీమ్ఇండియాదే ఆధిపత్యం.. న్యూజిలాండ్ 4/1


అలాగే ఈ మూవీ బాలీవుడ్‌హీరో సునీల్‌శెట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోనట్లు తెలుస్తోంది. ఈ మూవీ దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్‌‌ మూవీ రిలీజ్‌ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. కాగా ఈ మూవీని ఏప్రిల్ 1 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూరీ కనెక్ట్స్‌ (PuriConnects), ధర్మ ప్రొడెక్షన్స్‌.. ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.



 


Also Read : Ram Charan Siddha Teaser: ‘ఆచార్య’ నుంచి సిద్ధ టీజర్.. చిరంజీవి, చరణ్ లుక్ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook