Virata Parvam Voice of Ravanna: రానా దగ్గుబాటి-సాయి పల్లవి (Rana Daggubati-Sai Pallavi) జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. 1990'ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు ఒక నోస్టాల్జిక్ ఫీల్‌ను కలిగించేలా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 'వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్‌తో సాగే ఈ వీడియోలో... రానా పలికే సంభాషణలు  అద్భుతమైన పొయెటిక్ ఫీల్‌తో, రివల్యూషనరీ దృక్పథంతో ఉన్నాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా ఈ వాయిస్ ఓవర్‌ను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



'మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే... రౌద్రపు శత్రువు దాడిని ఎదిరించే పోరాటం మనదే... ఛలో పరిగెత్తు... అడుగు పిడుగై రాలేలా గుండెల దమ్మును చూపించు... చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం... వంగిన వీపుల బరువును దింపి విప్లవ గీతం వినిపిద్దాం... ఛలో పరిగెత్తు...' అంటూ సాగే 'వాయిస్ ఆఫ్ రవన్న' వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.


ఇక దర్శకుడు వేణు ఊడుగుల... ట్విట్టర్‌లో షేర్ చేసిన వాయిస్ ఆఫ్ రవన్న వీడియోకి అద్భుతమైన పొయెటిక్ లైన్స్‌ని జోడించాడు. 'ప్రజలు బిగిలించిన పిడికిలి అతడు.. ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని ధరించిన అడవి అతడు... ఆయుధమై కదిలిన ఆకాశం అతడు.. అరణ్య అలియాస్ రవన్న...' అంటూ సాగే వాక్యాలు సినిమా ఉద్దేశాన్ని, నేపథ్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి.


నిజానికి విరాటపర్వం సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ... ఇప్పటికీ ఆ విషయంలో క్లారిటీ లేదు. రానా (Rana Daggubati), సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విరాటపర్వంలో నవీన్ చంద్ర, నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Read: Telangana MLC Election: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook