Rana Daggubati Birthday: 'భీమ్లా నాయక్' నుంచి రానా దగ్గుబాటి బర్త్ డే సర్ ప్రైజ్!

Rana Birthday Surprise From Bheemla Nayak: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి మరో సర్​ప్రైజ్ వచ్చేసింది. నేడు (డిసెంబరు 14) రానా పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన టీజర్ ను సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 10:38 AM IST
    • 'భీమ్లా నాయక్' నుంచి రానా దగ్గుబాటి బర్త్ డే సర్ ప్రైజ్
    • 'స్వాగ్ ఆఫ్ డానియల్ శేఖర్' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన
    • మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల
Rana Daggubati Birthday: 'భీమ్లా నాయక్' నుంచి రానా దగ్గుబాటి బర్త్ డే సర్ ప్రైజ్!

Rana Birthday Surprise From Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు మరోసారి ట్రీట్​ ఇచ్చింది 'భీమ్లానాయక్​' చిత్రబృందం. నేడు (డిసెంబరు 14) రానా పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన పాత్ర డానియల్ శేఖర్ సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని 'భీమ్లా నాయక్'​ పాత్రలో పవన్ కల్యాణ్​.. డేనియల్​ శేఖర్​గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. గతంలో పవన్, రానా పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ స్క్రీన్​ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యా మేనన్.. రానా పక్కన సంయుక్త మేనన్ నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ఈ చిత్రంతో పాటు పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu Story), 'భవదీయుడు భగత్ సింగ్' (Pawan Kalyan Harish Shankar Movie), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ​ సినిమా నటిస్తున్నారు. ఇక రానా.. త్వరలోనే 'విరాట పర్వం' (Virata Parvam Movie Release Date) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

Also Read: BiggBoss 5 Title Winner: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో సన్నీనే టాప్, అతనికి ఇతరులకు తేడా ఇదే

Also Read: BiggBoss 5 Telugu Grand Finale:బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధులు ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News