Telangana MLC Election: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటికే ఆరు స్థానాల్ని టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు(Telangna MlC Elections) ఈ నెల 10వ తేదీన జరిగాయి. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకై షెడ్యూల్ విడుదల కాగా, ఆరు స్థానాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, అదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 26 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు 10మంది, నల్గొండ స్థానానికి ఏడుగురు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్ జిల్లాలో ముగ్గురు పోటీలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై..కాస్సేపటి క్రితమే పూర్తయింది. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్ని టీఆర్ఎస్(TRS) కైవసం చేసుకుంది. ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరిగిన దాఖలాల్లేవు. స్థానిక సంస్థల ప్రతినిధులు తమ పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకున్నారు.
కరీంనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎల్ రమణ, భాను ప్రసాదరావులు విజయం సాధించగా, ఖమ్మం నుంచి తాతా మధుసూదన్, నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి గెలిచారు. మెదక్ నుంచి యాదవ్ రెడ్డి, అదిలాబాద్ నుంచి దండే విఠల్ విజయం సాధించారు.
Also read: Bandi Sanjay : 'జీవో 317 ముఖ్యమంత్రి.. తుగ్లక్ పాలనకు నిదర్శనం': బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook