Vishal Health Update: సినీ నటుడు విశాల్‌ అస్వస్థతకు గురయ్యాడు. సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతడు వణుకుతూ కనిపించడంతో అతడి అభిమానులు భయాందోళన చెందారు. ఆ వేడుక తర్వాత వెంటనే ఆస్పత్రిలో చేరాడు. ఒక్కసారిగా తమ హీరో అలా వణుకుతూ కనిపించడంతో అభిమానులు 'ఏమైంది' అని ఆందోళన చెందుతున్నారు. విశాల్‌కు ఏం జరిగిందో ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ రిపోర్టు విడుదల చేశారు. అయితే విశాల్‌ వణుకుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్‌లో అపశ్రుతి.. గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ దిగ్భ్రాంతి


సుందర్‌ సి దర్శకత్వంలో 12 ఏళ్ల కిందట మొదలైన 'మదగజరాజ' సినిమా పుష్కరం తర్వాత ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నది. ఈనెల 12వ తేదీ విడుదల అవుతున్న సందర్భంగా చిత్రబృందం ఆదివారం చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న విశాల్‌ వణుకుతూ కనిపించాడు. అసలు మాట్లాడలేకపోయాడు. నీరసంగా కనిపించిన విశాల్‌ను చూసి అందరూ విస్తుపోయారు. ఏం జరిగిందా? అని ఆందోళన వ్యక్తం చేస్తుండగా అక్కడి యాంకర్‌ 'విశాల్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు' అని చెప్పారు. ఆ వీడియోలతో విశాల్‌కు ఏమైందని సినీ పరిశ్రమతోపాటు సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్‌ ఆరోగ్యంపై వివిధ వార్తలు చక్కర్లు కొట్టాయి. విశాల్‌కు ఏం జరిగిందనే విషయమై ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. విశాల్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ రిపోర్ట్‌ విడుదల చేశారు.

Also Read: KT Rama Rao: 'మోసం.. దగా.. నయవంచనకు కేరాఫ్‌ కాంగ్రెస్ పార్టీ.. రేవంత్‌ రెడ్డి'


'విశాల్‌ వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు అతడికి విశ్రాంతి కావాల్సి ఉంది' అని అపొలో ఆస్పత్రి వైద్యులు రిపోర్టులో చెప్పారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాగా అనారోగ్యంతో విశాల్‌ ముఖ కవళికలు కూడా మారిపోయాయి. గుర్తుపట్టలేని విధంగా విశాల్‌ ముఖం మారిపోయింది. కళ్లజోడు ధరించి కనిపించాడు. తీవ్ర స్థాయిలో జ్వరంతో బాధపడుతున్నట్లు అతడి ముఖం చూస్తే అర్థమవుతోంది. విశాల్‌ అనారోగ్యం వార్త విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులతోపాటు అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరికొందరు వీర అభిమానులు ఆలయాల్లో పూజలు చేసి విశాల్‌ ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నారు. కాగా అంజలి, వరలక్ష్మి జోడీగా నటించిన 'మదగజరాజ' సినిమా ఈనెల 12వ తేదీన థియేటర్‌లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook