BRS Party Protest: 'మోసం.. దగా.. నయవంచనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డి' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేతిలో రైతులు మోసపోతున్నారని చెప్పారు. రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని గుర్తుచేశారు. డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారని వివరించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ
రైతు భరోసాపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. రైతులను నిట్టనిలువునా ముంచుతున్న రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతు భరోసా రూ.12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, రైతు బంధుకు రూ.లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారని గుర్తుచేశారు. 'కేసీఆర్ రైతుబందుగా నిలిచారు.. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు' అని చెప్పారు.
Also Read: Kishan Reddy: 'రైతు భరోసాకు దరఖాస్తులతో రైతులకు రేవంత్ రెడ్డి మరో మోసం'
రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నా తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా' అని ప్రశ్నించారు. 'రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని రేవంత్ రెడ్డి నాశనం చేశాడు' అని కేటీఆర్ తెలిపారు.
'హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. సంవత్సరంలో రూ.లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పుతో పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలి' అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నికేదీయాలని పిలుపునిచ్చారు. 'రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతాము' అని ప్రకటించారు. రైతు బంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని రైతులకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook