Mark Antony Collection day 2: తమిళ నటుడు విశాల్ నయా మూవీ 'మార్క్ ఆంటోనీ'(Mark Antony). అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎస్‌.జే సూర్య, సునీల్, రీతూ వర్మ, అభినయ, సెల్వరాఘవన్  తదితరులు కీ రోల్స్ లో నటించారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కు మాస్, కామెడీ హంగులను అద్ది తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ సినిమా అదే హవాను రెండో రోజు కొనసాగించింది. విశాల్ కెరీర్‍లోనే అత్యధిక ఓపెనింగ్స్ ఈ మూవీకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 22న  హిందీలో కూడా రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. దాదాపు ఐదేళ్ల తర్వాత విశాల్ ఈ మూవీ ద్వారా సాలిడ్ హిట్ కొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమారు రూ.30 కోట్లు బడ్డెట్ తో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సినిమా.. సుమారు రూ. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్‌గా రూ. 40 కోట్లు ఫిక్స్ అయింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అత్యధికంగా తమిళనాడులో 1100 థియేటర్లు, తెలుగు రాష్ట్రాల్లో 500 థియేటర్లలో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సినిమాకు ఫస్ట్ డే సుమారు రూ.10 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు ఈ మూవీ రూ. 6.29 కోట్ల షేర్, రూ.8.5 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లో పాతిక కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రానికి తెలుగులో కూడా భారీ ఓపెన్సింగ్స్ దక్కాయి. అయితే రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గాయి. ఈ మూవీ ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. 



Also read: Youtuber Harsha Sai: ఆసక్తికరంగా యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్, టీజర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook