Vishwak Sen: రెమ్యూనరేషన్ తీసుకోలేదు..లేడీ పాత్రలో కనిపించనున్నాను : విశ్వక్ సేన్
Gaami: విశ్వక్ సేన్ సినిమాల కన్నా కూడా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ హీరో నుంచి వచ్చినగా మీ ట్రైలర్ మాత్రం సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు ఈ హీరో.
Vishwak Sen Gaami:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా త్వరలో రాబోతున్న చిత్రం గామి. ఈ సినిమా మొదటిలోకం నుంచే ఈ చిత్రం పైన ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెండు రోజుల క్రితం విరుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఎవరు ఊహించని రీతిలో ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఎఫ్ ఎక్స్ ఉండబోతున్నాయని ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది.
ఈ సినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించనున్నారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ తెరకెక్కిన ఈ సినిమా వి సెల్యులాయిడ్ సమర్పిస్తుండగా ఈ చిత్రం మార్చ్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు ఈ హీరో.
గామి చిత్రానికి విశ్వక్ కూడా ఒక నిర్మాత కావడంతో..మీరు నిర్మాత కూడా కదా.. ఈ సినిమాకి సపోర్ట్ చేసారా అని ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ ని అడగగా..’ఈ చిత్రానికి నేను చేసిన సపోర్ట్ రెమ్యునిరేషన్ తీసుకోకపోవడం. నేను ఈ సినిమాకి ఎటువంటి బర్డెన్ కాలేదు. మొదట రోజు సెట్ లో ఎలాంటి లైఫ్ స్టయిల్ లో ఉన్నానో ఆరు నెలలు క్రితం షూట్ కి వెళ్ళినప్పుడు కూడా అలానే వున్నాను. డెబ్బై రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నిజంగా ఈ సినిమా షూటింగ్ ఒక సాహసమే అని చెప్పాలి. మంచు పడితే ప్రాణానికే ప్రమాదం అని తెలిసి కూడా షూటింగ్ కి వెళ్ళేవాళ్ళం. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన చాందిని కూడా అలాగే కష్టపడింది’ అని చెప్పుకొచ్చారు.
ఇక తన తదుపరి ప్రాజెక్ట్ గురించి చెబుతూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఈ హీరో. తాను త్వరలోనే ‘లైలా’ అనే ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ లైలా చిత్రంలో తాను లేదు గెటప్ లో అమ్మాయిగా నటించబోతున్న అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా విశ్వక్ లేడీ గెటప్ లోనే కనిపిస్తాడట. ఇక ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి విశ్వక్ అభిమానులకు తన తదుపరి ప్రాజెక్టు పైన కూడా మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ వైవిధ్యమైన కథలు, పాత్రలతో విశ్వక్ ఫ్యూచర్లో ఎలాంటి విజయాలు సాధిస్తారో వేచి చూడాలి.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter