Namo Movie First Look Poster: వినోదాత్మక చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అది చిన్న సినిమానా..? పెద్ద సినిమానా..? అన్న తేడా చూడకుండా.. నవ్వులు పంచే సినిమా అయితే చాలు హిట్ చేస్తామని ఆడియన్స్ ఎన్నో సార్లు నిరూపించారు. ఈ క్రమంలోనే సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ను తెరకెక్కిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రముఖ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి.. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆదిత్య రెడ్డి తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారని.. ఎంతో సిన్సియర్‌గా ఉంటారని చెప్పారు. అతను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోందని.. ఏదో చేయాలని, నేర్చుకోవాలన్న తపన ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయన్నారు. నమో టైటిల్ వినగానే ప్రధాని నరేంద్ర మోదీ మీద స్టోరీ అనుకున్నానని కానీ నగేష్, మోహన్ హీరోల క్యారెక్టర్ల పేర్ల మీద టైటిల్ పెట్టానని చెప్పారని తెలిపారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 


డైరెక్టర్ ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ.. తన గురువు భీమనేని శ్రీనివాసరావుకు థ్యాంక్స్ చెప్పారు. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీని ఒప్పుకున్న హీరో విశ్వంత్‌, హీరోయిన్ విస్మయకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. హాయిగా నవ్వుకునేలా ఉంటుందని అన్నారు. హీరో విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ.. ఇదో డిఫరెంట్ మూవీ అని.. దర్శకుడు ఆదిత్య సరికొత్త రాసుకున్నారని చెప్పారు. సినిమా ఇంత వేగంగా పూర్తికావడంలో క్రెడిట్ దర్శకుడికే దక్కుతుందన్నారు. నమో చిత్రాన్ని మున్ముందు సిరీస్‌లుగా కూడా తీయొచ్చన్నారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుందని.. తప్పకుండా చూడాలని కోరారు. 


ఈ రోజు మూవీ పోస్టర్, టైటిల్ లాంచ్ చేశామని.. సినిమా గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని అనురూప్ కటారి అన్నారు. ఈ మూవీ ట్యాగ్ లైన్ ఫుల్ వైరల్ అవుతుందన్నారు. సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుందని.. విశ్వంత్ చాలా బాగా యాక్ట్ చేశారని హీరోయిన్ విస్మయ తెలిపారు. అనురూప్ పాత్ర బాగుంటుందని.. మూవీ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి