VV Vinayak failed with Chatrapathi remake: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరంగా ఈ సినిమా కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీ రీమేక్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా నిన్న విడుదలైంది కానీ సినిమా మీద బాలీవుడ్ ప్రేక్షకులు కానీ సినీ విమర్శకులు కానీ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. నుస్రత్ భరూచా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని వివి వినాయక్ హిందీలో రీమేక్ చేశారు. నిజానికి ఇది మొట్టమొదటి వినాయక్ హిందీ సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తెలుగు సినిమాలను యూట్యూబ్లో హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఆరేడు వందల మిలియన్ వ్యూస్ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందని భావించి పెన్ స్టూడియో అధినేత ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు.


Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!


అయితే ఈ సినిమా హిందీలో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పూర్తి స్థాయిలో ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు పక్కన పెట్టేసినట్లే అర్థమవుతుంది. దానికి ప్రధానమైన కారణం ఒరిజినల్ స్టోరీ నుంచి అనేక ప్రధానమైన ఘట్టాలను ఈ సినిమాలో రన్ టైం కారణంగా తొలగించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎమోషన్ క్యారీ అవ్వలేక మిస్ ఫైర్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.


ఒరిజినల్ చత్రపతి సినిమాలో మదర్ సెంటిమెంట్ తో పాటు కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ బాగా పండాయి. కానీ ఈ హిందీ చత్రపతి విషయానికి వస్తే ఎక్కువగా యాక్షన్ సీన్స్ మీదనే దృష్టి పెట్టి పని చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటికే  మోసం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా కథ వచ్చి దాదాపు 20 ఏళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ అవుట్ డేటెడ్ గా అనిపించిందని దాదాపుగా బాలీవుడ్ ప్రజలందరూ లైట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.


Also Read: Keerthy Suresh Photos: అప్పుడే ఏడాది అంటూ ఆ హాట్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook