800 The Movie Pre-release event: లెజండరీ క్రికెటర్,  శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ (Muthiah Muralidaran) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 800. ఈ చిత్రంలో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ ఫేమ్ మధుర్‌ మిట్టల్‌ (Madhurr Mittal) లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్‌ రంగచారి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ స‌చిన్ టెండూల్కర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహిమ నంబియార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్‌ రైట్స్‌ను శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ అధినేత, పాపులర్‌ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ దక్కించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే సెప్టెంబరు 25న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా టీమిండియా మాజీ క్రికెటర్‌, హైదరాబాదీ బ్యాట్స్‌మెన్‌ వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. టెస్టు కెరీర్ లో 800 వికెట్స్ తీసిన బౌలర్ గా మురళీధరన్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఆ స్ఫూర్తితోనే ఈ సినిమాకు 800 టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో  నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


Also Read: Nithya Menon: బార్ పెడతానంటున్న నిత్యామీనన్... ఆసక్తికరంగా ‘కుమారి శ్రీమతి’ సిరీస్ ట్రైలర్


Also Read: BB 7 Telugu latest promo: కింద పడ్డా శోభా.. గుండె పగిలేలా ఏడ్చిన యావర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook