Actor Karthi Sultan Movie Latest Updates: దక్షిణాదిన మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోల జాబితాలో సూర్య, కార్తీ సోదరులు తప్పక ఉంటారు. వీరు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. గతంలో పలు డబ్బింగ్, తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు చేరువైన ప్రస్తుతం కార్తీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సుల్తాన్. కార్తీ చివరగా ఖైదీ సినిమాతో తెరపై కనిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్‌తో రెమో లాంటి సినిమా తీసి హిట్ కొట్టిన భాగ్యరాజ్ కన్నన్ సుల్తాన్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే సూర్య సుల్తాన్ టీజర్(Sultan Teaser) విడుదల కాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరగడంతో తెలుగు హక్కుల కోసం భారీగానే వెచ్చించారు. సుల్తాన్ మూవీ టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను వరంగల్ శ్రీను తీసుకున్నట్లు సమాచారం.


Also Read: Uppena Movie In OTT: ఓటీటీ వేదికగా ఉప్పెన, భారీ ధర పలికిన Vaishnav Tej ఫస్ట్ మూవీ


ఏప్రిల్ 2న విడుదల కానున్న కార్తీ తాజా సినిమాపై అంచనాలు పెంచుకున్న వరంగల్ శ్రీను మార్కెట్ ఆధారంగా రూ.7 చెల్లించి తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్నారని తెలుస్తోంది. ఇటీవల రవితేజ క్రాక్, విశాల్ మూవీ చక్రతో పాటు అల్లరి నరేష్ నాంది సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు వరంగల్ శ్రీను. ఈ క్రమంలో కార్తీ(Actor Karthi) లేటెస్ట్ మూవీ సుల్తాన్ హక్కులు తీసుకున్నాడు.


Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు


కాగా, కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన అనంతరం కొన్ని నెలలుగా బిజీ షెడ్యూళ్లలో సినిమా, సీరియల్ షూటింగ్స్ జరుగుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా ఇతర నటీనటుల మాదిరిగానే కార్తీ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో సుల్తాన్ విడుదల సైతం ఆలస్యమైంది.


Also Read: Chiranjeevi Acharya Shooting: రాజమండ్రిలో చిరంజీవికి అపూర్వ స్వాగతం, ఏజెన్సీ ప్రాంతంలో Acharya Shooting 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook