Whistles for Pavitra Lokesh In Ramarao on duty Theaters: రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా జూలై 29 వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా ఊహించిన మేర అంచనాలను అందుకోవడంలో విఫలమైందని అంటున్నారు.రవితేజ డిప్యూటీ కలెక్టర్గా అలాగే ఎమ్మార్వోగా కనిపించిన ఈ సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ అని ముందు నుంచి ప్రచారం చేశారు. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఒక అంశం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో పవిత్ర లోకేష్ రవితేజ తల్లి పాత్రలో కనిపించారు. అయితే నరేష్ మాత్రం హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించారు. అంటే ఒకరకంగా వీరిద్దరూ కూడా అన్నాచెల్లెళ్ల పాత్రలలో కనిపించారు, వీరిద్దరూ కలిసి కనిపించింది ఒకటి రెండు సన్నివేశాలలోనే ఆయినా వీరిద్దరూ కలిసి కనిపించిన సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ లభించిందని చెబుతున్నారు.


పవిత్ర లోకేష్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా సరే రవితేజ కనిపించినపుడు కనిపించిన ఊపు కంటే ఎక్కువగా ప్రేక్షకులు, అభిమానులు కేరింతలు కొట్టారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి పవిత్ర లోకేష్ తన భర్త నుంచి విడిపోయి వేరేగా ఉంటున్నారని అలాగే నరేష్ కూడా ఒంటరిగా జీవిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంబంధం బాంధవ్యాలు బలపడి ఇద్దరూ కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి.


నరేష్ భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాక మైసూర్ లో ఒకే హోటల్లో ఒకే గదిలో కలిసి ఉన్న నరేష్, పవిత్ర మీద చెప్పులతో దాడి చేసిన ఘటన కూడా సంచలనగా మారింది. ఇక సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారుతున్న పవిత్ర లోకేష్ స్క్రీన్ మీద కనపడగానే ఆడియన్స్ ఒక రేంజ్ లో రెస్పాండ్ అయ్యారని అంటున్నారు. అయితే అది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారా అనే విషయం మీద పవిత్ర లోకేష్ కెరీర్ ఆధారపడి ఉంటుంది.


ఎందుకంటే నరేష్ వివాదం ఏర్పడిన సమయంలోనే ఆమెను రెండు మూడు పెద్ద సినిమాల నుంచి తొలగించారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా పవిత్ర లోకేష్ కి లభించిన రెస్పాన్స్ చూస్తుంటే ఒకవేళ అది పాజిటివ్ రెస్పాన్స్ అని దర్శక నిర్మాతలకు అనిపిస్తే ఖచ్చితంగా ఆమెను భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కూడా తీసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Read Also: GodFather Update: సల్మాన్ తో కలిసి చిందేయనున్న చిరు.. కన్నుల పండుగే అంటూ ట్వీట్


Read Also: Gully boys Riyaz: భార్యతో 'జీ తెలుగు జాతర'లో రచ్చ చేసిన రియాజ్.. ఎలా ఉందో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook