White Hair Spotted in Prabhas Beard: ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 బాహుబలి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి పాల్గొంటున్నట్లు ముందే ఆహా వీడియో యాజమాన్యం ప్రకటించింది. దానికి తగినట్లుగానే దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలు ఇప్పటికే విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు బాహుబలి ప్రోమో పేరుతో మరో బడా ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ప్రభాస్ లుక్స్ ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఈ ప్రోమోలో ప్రభాస్ కొంచెం లావుగా కనిపిస్తున్నాడు కానీ కొంత మంది ప్రభాస్ గెడ్డంలో కొన్ని వెంట్రుకలు తెల్లబడిపోయాయి అని కూడా కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్ గడ్డంలోని కొన్ని వెంట్రుకలు నిజంగా తెల్లబడ్డాయా లేదా అనేది అక్కడ క్లారిటీగా కనిపించడం లేదు.


అయితే సాధారణంగా ఇలాంటి షోలు షూట్ చేస్తున్నప్పుడు హై ఫోకస్ లైట్లను సెలబ్రిటీల ముఖాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ ఫోకస్ తేడా అయినప్పుడు నల్లగా ఉన్న వెంట్రుకలు కూడా ఒక్కోసారి తెల్లగా షైన్ అవుతూ కనిపిస్తాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ లుక్ కూడా అంత ఆకట్టుకునే విధంగా లేదని కొందరు కామెంట్ చేస్తుంటే ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉండి కాస్త టైర్డ్  అయినట్టు అనిపిస్తున్నాడు తప్ప ఆయన లుక్కుకి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభాస్ అభిమానులు అంటున్నారు.


ఇక మరో పక్క శృతిహాసన్ ను పొగిడినప్పుడు నువ్వు కాస్త హర్ట్ అయ్యావు కదా అంటూ ప్రభాస్ ను నందమూరి బాలకృష్ణ కామెంట్ చేయడంతో దానికి ఆయన చేతులెత్తి దండం పెడుతూ సిగ్గుపడడం ఆసక్తికరంగా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోమో మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.


Also Read: Who is Rani : ప్రభాస్ కు 'రాణి'తో ఏంటి సంబంధం.. కొత్త అనుమానాలు రేపిన గోపీచంద్!


Also Read: Prabhas Marriage: పెళ్లెప్పుడంటే ప్రభాస్ షాకింగ్ ఆన్సర్.. ఆ హీరోకి అయ్యాకనే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.