Prabhas Marriage: పెళ్లెప్పుడంటే ప్రభాస్ షాకింగ్ ఆన్సర్.. ఆ హీరోకి అయ్యాకనే అంటూ!

Prabhas Interesting Comments on Marriage: ఎప్పటికప్పుడు తన పెళ్లి హాట్ టాపిక్ అవుతూ ఉండడంతో ప్రభాస్ తాజాగా అన్ స్టాపబుల్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 17, 2022, 09:32 PM IST
Prabhas Marriage: పెళ్లెప్పుడంటే ప్రభాస్ షాకింగ్ ఆన్సర్.. ఆ హీరోకి అయ్యాకనే అంటూ!

Prabhas Interesting Comments on Marriage: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది ప్రభాస్ పెళ్లి గురించే. బాహుబలి సినిమా చేసుకున్నప్పటి నుంచి ఎక్కువగా ప్రభాస్ పెళ్లి వార్తలు తెరమీదకు రావడం ప్రారంభమయ్యాయి. ఆ సినిమాలో ఆయనతో నటించిన అనుష్క గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి.

ఆ విషయాన్ని వీరు పలు సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. ఈ మధ్య ఏకంగా కృత్రి సనన్ తో కూడా ప్రభాస్ ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు పుట్టుకురావడం కూడా మనం చూస్తే అన్నాం. అయితే ఈ పెళ్లి గురించి ప్రభాస్ తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోకి తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి హాజరైన ప్రభాస్ పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సభాముఖంగా అడుగుతున్నాను నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలి అంటే సరే డార్లింగ్ సార్ అంటూ అందరి ముఖాల మీద చిరునవ్వు తెప్పించే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఆ తర్వాత శర్వానంద్ ఇక్కడికి వచ్చినప్పుడు అతని పెళ్లి గురించి అడిగానని అప్పుడు అతను ప్రభాస్ పెళ్లి అయిన తర్వాతే నా పెళ్లి అవుతుందని అన్నాడని బాలకృష్ణ పేర్కొన్నారు.  వెంటనే ప్రభాస్ మాట్లాడుతూ అయితే నేను సల్మాన్ ఖాన్ పెళ్లయిన తర్వాత చేసుకుంటాను అని చెప్పాలేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ మూమెంట్ ఏమిటి అని అడిగితే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయిన ప్రభాస్ మీకు అప్పట్లో ఏ గోల లేదు ఇప్పుడు మేము ఏమీ చేయకపోయినా అనేక రకాల పుకార్లు పుట్టిస్తూ వస్తున్నారని డేటింగ్ రూమర్స్ గురించి చెప్పుకొచ్చారు. అయితే దానికి నందమూరి బాలకృష్ణ కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. మేము అప్పట్లో ఎన్ని సినిమాలు చేసే వాళ్ళమో తెలుసా అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా మీ మీద పుకార్లు ఎన్ని వచ్చేవో కాదని ప్రభాస్ పేర్కొన్నారు. 

Also Read: Who is Rani : ప్రభాస్ కు 'రాణి'తో ఏంటి సంబంధం.. కొత్త అనుమానాలు రేపిన గోపీచంద్!

Also Read: Actress Ramya : మొన్న సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. అందుకే వారిని టార్గెట్ చేశారంటున్న హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News